పోలీస్ అమరవీరుల కుటుంబాలకు ప్రజలు బాసటగా నిలవాలి


Mon,October 21, 2019 05:09 AM

వరంగల్ క్రైం, అక్టోబర్20 : విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ అమరవీరుల కుటుంబాలకు బాసటగా నిలువాలని వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ విశ్వనాథ రవీందర్ పేర్కొన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా అదివారం కమిషనరేట్ కార్యాలయంలో ఎంజీఎం బ్లడ్‌బ్యాంక్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించి, రక్తదానం చేశారు. అనంతరం సీపీ రవీందర్ మాట్లాడుతూ పోలీస్ త్యాగాలతోనే శాంతి నెలకొల్పబడిందని, వారి త్యాగాలను ప్రజలు గుర్తించాలని అన్నారు. నిరంతరం ప్రజల భద్రత కోసం పని చేసే పోలీసులకు ప్రజలు సహకరించాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమన్నారు. ఈ సందర్భంగా అర్మ్‌డ్ రిజర్వ్, ట్రాఫిక్ అధికారులు, ట్రైసిటీలోని యువత, ఆటోడ్రైవర్స్ స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేశారు. కార్యక్రమంలో అదనపు డీసీపీలు వెంకటలక్ష్మి, భీంరావు, ఏసీపీలు జనార్దన్, శ్రీనివాసులు, ఆర్‌ఐలు భాస్కర్, హతీరాం, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్లు హన్నన్, స్వామి, ఆర్‌ఎస్సై శ్రీధర్‌రెడ్డి, వైద్యులు విజయ్, సురేశ్‌కుమార్, ప్రసాద్, ఎంజీఎం బ్లడ్‌బ్యాంక్ ప్రతినిధి కళ్యాణి పాల్గొన్నారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...