నగరంలో రాజు గారి గది-3


Mon,October 21, 2019 05:08 AM

రెడ్డికాలనీ, అక్టోబర్ 20: నగరంలో రాజుగారిగది-3 చిత్రబృందం సందడి చేసింది. డైరెక్టర్ ఓంకార్, హీరో అశ్విన్‌బాబు, హీరోయిన్ అవికా గోర్ సినిమా ప్రదర్శిస్తున్న హన్మకొండలోని అశోకా థియేటర్‌లో ఆదివారం సాయంత్రం ప్రే క్షకులను కలుసుకున్నారు. విషయం తెలుసుకున్న అభిమానులు ముందుగానే పెద్దఎత్తున థియేటర్ వద్దకు చేరుకున్నారు. థియేటర్ మేనేజర్ వేణుగోపాల్ ఆధ్వర్యంలో చిత్ర యూనిట్‌కు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అభిమానులు వారితో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. ముఖ్యంగా హీరోయిన్ అవికా గోర్‌తో కరచాలనం చేసేందుకు యువత ఆసక్తి చూపారు. ఈ సందర్భంగా చిత్ర బృందం థియేటర్‌లో ప్రేక్షకులకు అభివాదం చేస్తూ వారిలో జోష్ నింపారు. డైరెక్టర్ ఓంకార్ మాట్లాడుతూ తమ్ముడు హీరో అశ్విన్‌బాబును ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. మీరు సినిమా చూసి ఇతరులకు బాగుందని చెప్పాలని కోరారు. హీరోని ఓ అభిమాని రంగస్థలం హీరోలా ఉన్నావని కితాబిచ్చాడు. అనంతరం హీరో అశ్విన్‌బాబు మాట్లాడుతూ సినిమా ఎలా ఉందని ప్రేక్షకులను అడిగి తెలుసుకున్నారు. ఇంటర్వెల్‌లో తక్కువగా తినండి ఎందుకంటే సెకండాఫ్ ఇంకా కడుపుబ్బ నవ్విస్తామని చెప్పారు. అందరూ నవ్వుతూ సినిమా చూడవచ్చన్నారు. అనంతరం హాయ్.. వరంగల్ అంటూ హీరోయిన్ అవికాగోర్ పలకరించడంతో యువత కేకలు పెట్టారు. సినిమాను అందరూ చూసి ఎంజాయ్ చేయాలన్నారు. కాగా, సెక్యూరిటీ లేకుండా హీరోయిన్ రావడంతో ఆమె ఇబ్బందులు ఎదుర్కోక తప్పలేదు.

133
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...