టీఆర్‌ఎస్ మండల అధ్యక్షులకు శుభాకాంక్షలు


Sun,October 20, 2019 04:16 AM

నర్సంపేట,నమస్తేతెలంగాణ/ నర్సంపేట రూరల్, అక్టోబర్ 19 : మండలంలోని మాదన్నపేట గ్రామంలో శనివారం టీఆర్‌ఎస్ మండల నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన నామాల సత్యనారాయణను పలువురు టీఆర్‌ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు అభినందించారు. మాదన్నపేట సర్పంచ్ మొలుగూరి చంద్రమౌళి, ఉప సర్పంచ్ మారపాక నర్సయ్య, రైతు సమన్వయ సమితి కన్వీనర్ కడారి కుమారస్వామి, గ్రామ పార్టీ అధ్యక్షుడు పెసరు సాంబరాజ్యం ఆధ్వర్యంలో సత్యనారాయణను శాలువాలతో సన్మానించారు. అలాగే నర్సంపేట పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో సత్యనారాయణను సన్మానించారు. ఈ కార్యక్రమంలో శ్రీరాముల కోటేశ్వర్‌రావు, పర్శ శ్రీధర్, కందకట్ల రాజేందర్, మర్ధ అశోక్, బేతి కన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
ఖానాపురం : టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడిగా ఎన్నికైన బుధరావుపేటకు చెందిన మహాలక్ష్మి వెంకటనర్సయ్యను శనివారం లక్ష్మీ మహిళా సంఘం వీవో బాధ్యులు శాలువా,పూలమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా వెంకటనర్సయ్య మాట్లాడుతూ.. మహిళా సంఘాల అభివృద్ధికి ప్రభుత్వ పరంగా సహకారం అందించేందుకు కృషి చేస్తానని అన్నారు. సన్మానించిన వారిలో సీసీ షేక్ నూరీన్నిసా, సీఏలు యాకుబీ, వీవో అధ్యక్షురాలు బైరెడ్డి లక్ష్మి,కార్యదర్శులు షేరు పద్మ, బైరెడ్డి వసుమతి,కోడి భారతమ్మ, జటంగి భవాని తదితరులు ఉన్నారు.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...