పది రోజుల్లో రూ.10 లక్షలు ఇవ్వాలి


Sat,October 19, 2019 03:30 AM

వరంగల్ క్రైం, అక్టోబర్ 18: నాటు వైద్యం పేరుతో నయీంనగర్‌లో క్లినిక్ ఏర్పాటు చేసి లక్ష లు దండుకున్న ఘరానా మోసగాడు తన దగ్గర మెడికల్ స్టోర్‌లో కొంత కాలం పని చేసిన వ్యక్తికి ఫోన్ చేసి రూ.10 లక్షలు డిమాండ్ చేశాడు. అడిగిన మొత్తం ఇవ్వకుంటే తండ్రీ, కొడుకును హతమారుస్తానని హెచ్చరికలు జారీ చేశా డు. మిమ్మల్ని నా మనుషులు వెంబడిస్తున్నారు.. ఎ ప్పుడు మీ గొంతులు కోసేది తెలవదు అని ఫో న్‌లో బెదిరించుకుంటూ వస్తున్నాడు. ఈ తతంగాన్ని మొత్తం బా ధితుడు ప్రభాకర్, కొడుకు వినయ్ రికార్డు చేసి పోలీసుల ముందుపెట్టారు. పోలీసుల కథనం ప్రకారం.. బాధితుడు తాటిపెల్లి ప్రభాకర్ 8 సంవత్సరాలుగా హన్మకొండ నయీంనగర్‌లో ని బోరింగ్ ఆఫీస్ సమీపంలో మెడికల్ స్టోర్ నిర్వహిస్తున్నాడు. గతనెల 30న ఖాదిర్ అహ్మద్ ము గ్గురు వ్యక్తులతో షాపులోకి చొరబడి ప్రభాకర్‌ను తీవ్రంగా గాయపర్చాడు. షాపు అద్దాలు పగలగొట్టి రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.

దీంతో భయాందోళనకు గురైన ప్రభాకర్ హైదరాబాద్‌లోని తన కుమారుడి ఇంటికి వెళ్ళి వైద్యం చే యించుకుని తిరిగి నగరానికి వచ్చాడు. ఈక్రమంలో నిందితుడు మరోమారు మ ధ్యవర్తి ద్వారా ప్రభాకర్‌ను పిలిపించి డబ్బులు ఇవ్వకుంటే చంపుతానని బెదిరించి, సెల్‌ఫోన్ లాకున్నాడు. ఆ మొబైల్ నుంచి హైదరాబాద్‌లోని ప్ర భాకర్ కుమారుడికి ఫోన్ చేసి పది రోజుల్లో రూ. 10 లక్షలు ఇవ్వకుంటే తండ్రీకొడుకులను హతమారు స్తానని బెదిరింపులకు గురిచేయడంతో ప్ర జాసేన స్వచ్ఛంద సంస్థను ఆశ్రయించారు. సంస్థ అధ్యక్షుడు రజినీకాంత్ సహకారంతో హన్మకొండ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. కా గా బాధితుడి ఫిర్యాదుతో నిందితుడు ఖాదిర్ అ హ్మద్‌పై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు హన్మకొండ ఏసీపీ బోనాల కిషన్ తెలిపారు.

88
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...