ఆర్టీసీపై ప్రతిపక్షాలది మొసలి కన్నీరు: చల్లా


Sat,October 19, 2019 03:30 AM

పరకాల, నమస్తే తెలంగాణ : ఆర్టీసీపై ప్రతిపక్షాలు మొసలికన్నీ రు కారుస్తున్నాయని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో ఎందుకు వి లీనం చేయలేదని ప్రశ్నించారు. పరకాల ఎమ్మెల్యే క్యాం పు కార్యాలయంలో పరకాల, నడికూడ మండలాలకు చెందిన 112 మంది దివ్యాంగులకు శుక్రవారం సదరం సర్టిఫికెట్లు ఎమ్మెల్యే పంపిణీ చేసి మాట్లాడారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తయితే ఆసరా పింఛన్లు మరింత పెరుగుతాయని అన్నారు. అర్హులైన వారిలో కొంతమందికి సదరం సర్టిఫికెట్లు రావడంలేదని మంత్రి ఎర్రబెల్లితో కలిసి సీఎం దృష్టికి తీసుకెళ్లామని, సీ ఎం ఆరోగ్యశాఖ కమిషనర్‌తో మాట్లాడి రాష్ట్రంలో ప్ర త్యేక క్యాంపులను ఏర్పాటు చేయించారని అన్నారు. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు ప్రతిపక్ష పార్టీలు మద్దతిచ్చిన ట్లు చెప్పుకుని తిరుగుతున్నాయని, బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఎందుకు ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయడంలేదని ధర్మారెడ్డి ప్రశ్నించారు. మహారాష్ట్రలో ఆర్టీసీ కార్మికుల నెల వేత నం రూ.16వేలని, తెలంగాణలో అది కనీసం రూ.30వేలుగా ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పింఛన్ల కోసం రాష్ర్టానికి రూ. 200 కోట్లు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం రూ.9,460 కో ట్లతో పింఛన్లను అందిస్తున్నదని అన్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...