హత్యకేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్


Sat,October 19, 2019 03:29 AM

మట్టెవాడ, అక్టోబర్ 18: వరంగల్ రామన్నపేటలోని గౌడబార్ అండ్ రెస్టారెంట్ వద్ద బుధవారం అర్ధరాత్రి తర్వాత జరిగిన ఎండీ అల్లావుద్దీన్ హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు వరంగల్ ఎసీపీ నర్సయ్య తెలిపారు. వరంగల్ మట్టెవాడ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. వరంగల్ పాపయ్యపేటకు చెందిన ఆటోడ్రైవర్ ఎండీ ఖాజా అల్లావుద్దీన్ అల్లుడి వివాహం ఉన్నందున సంతోష సమయంలో తన మిత్రులు ఎండీ సంధాని, ఎండీ యాకూబ్‌తో కలిసి మద్యం తాగడానికి గౌడబార్ అండ్ రెస్టారెంట్ వద్దకు వెళ్లారు. మద్యం తీసుకుని తాగుతూ సరదాగా మాట్లాడుకుం టూ ఉన క్రమంలో వారి వెనుకాలే బీర్లు తాగుతున్న నిందితులు శివనగర్‌కు చెందిన ఎస్డీ నజీర్, ముక్కెర శశికాంత్, అనుగుల సోమేశ్వర్‌లు తమను తిడుతున్నారని భావించి వారితో గొడవకు దిగారు. విచక్షణ రహితంగా బీరు సీసాలు పగులగొట్టి దాడికి పాల్పడడంతో అల్లావుద్దీన్ తీవ్రంగా గాయపడి మృతి చెందాడు.

అంతే కాకుండా మృతు డి మిత్రులకు కూడా గాయాలు అయ్యాయని వారు ఇచ్చిన ఫిర్యాదు మే రకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న క్రమంలో ముగ్గురు నిందితులను శివనగర్ ప్రాంతంలో పట్టుకుని వారి వద్ద మోటర్ సైకిల్, రక్తపు మరకలు ఉన్న వారి దుస్తువులను స్వాధీనం చేసుకున్నాం అని ఏసీపీ నర్సయ్య వివరించారు. విలేకరుల సమావేశంలో మట్టెవాడ ఇన్‌స్పెక్టర్ గణేశ్, ఎస్సై బండారి వెంకటేశ్వర్లు, సిబ్బంది మహేందర్, విజయ్, సంతోష్, హఫీజ్, వాజీద్ తదితరులు పాల్గొన్నారు.

ఇద్దరిపై రౌడీషీట్
అల్లావుద్దీన్ హత్య కేసులో నిందితులుగా ఉన్న శివనగర్‌కు చెందిన ఎస్డీ నజీర్ 2017, 2018సంవత్సరాలలో మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్ పరిధిలో కొట్లాట కేసులో నిందితుడని ఏసీపీ నర్సయ్య వివరించారు. మరో నిందితుడు ముక్కెర శశికాంత్ కూ డా కొట్లాట కేసులో ఉన్నాడని, వీటిని పరిగణనలోకి తీసుకుని వీరిద్దరిపై రౌడీషీట్ ఓపెన్ చేసేలా వరంగల్ పోలీస్ కమిషనర్‌కు సిఫారసు చేయనున్నట్లు ఆయ న తెలిపారు. నేరం చేసిన వారు ఎవరైనా ఎట్టి పరిస్థితులలో వదిలిపెట్టెది లేదని అన్నారు. తాను వరంగల్ ఏసీపీగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి సుమారు25 సస్సెక్ట్ షీట్స్ ఓపెన్ చేసినట్లు ఆయన తెలిపారు.

ఆ బార్‌ల లైసెన్స్ రద్దుకు సిఫారసు
వరంగల్ నగరంలో సమయపాలన పాటించకుండా మద్యం విక్రయాలు చేపడుతున్న బార్, రెస్టారెంట్స్, వైన్స్‌లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏసీపీ అన్నారు. నిబంధనలు పాటించని వారి లైసెన్స్‌లను రద్దు చేసేలా ఎక్సైజ్ శాఖకు సిఫారసు చేస్తామన్నారు. సమయపాలన పాటించని వారిని ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...