కాజీపేట రైల్వే జంక్షన్ మీదుగా


Sat,October 19, 2019 03:29 AM

-దానాపూర్‌కు ప్రత్యేక రైళ్లు
కాజీపేట, అక్టోబర్ 18 : ఉత్తర భారత దేశంలో త్వరలో జరుగనున్న ఛాత్ పండుగ ఉత్సవాల సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం కాజీపేట రైల్వే జంక్షన్ మీదుగా దానాపూర్ రైల్వే స్టేషన్ వరకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. వారు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఛాత్ పండుగ సందర్భంగా సికింద్రాబాద్-దానాపూర్-సికింద్రాబాద్ మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నారు. సికింద్రాబాద్ - దానాపూర్(పాట్నా) మధ్య జనసాధరణ్ స్పెషల్ రైలు 07639 నంబర్‌తో సికింద్రాబాద్‌లో అక్టోబర్ 29న మంగళవారం సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాలకు బయలు దేరి అక్టోబర్ 31న గురువారం తెల్లవారు జామున మూడు గంటలకు పాట్నాకు చేరుకుంటుంది. తిరిగి అదే రైలు(07640) జనసాధారణ్ పేరుతో పాట్నా రైల్వే స్టేషన్‌లో నవంబర్ 4న సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు బయలు దేరి నవంబర్ 6న బుధవారం తెల్లవారు జామున మూడు గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. జనసాధారణ్ రైలుకు మాత్రం రాక పోకలలో పూర్తిగా సెకండ్ క్లాస్ జనరల్ బోగీలు ఉంటాయి.

సికింద్రాబాద్-పాట్నాల మధ్య నడిచే స్పెషల్ రైలు(02791) సికింద్రాబాద్‌లో అక్టోబర్ 30న బుధవారం సాయంత్రం ఆరుగంటల ఇరవై నిముషాలకు బయలుదేరి నవంబర్ 1న తెల్లవారు జామున మూడు గంటలకు పాట్నా రైల్వే స్టేషన్‌కు చేరుతుంది. అదే రైలు (02792) తిరిగి నవంబర్ 5న మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు పాట్నా రైల్వే స్టేషన్‌లో బయలు దేరి నవంబర్ 7న గురువారం తెల్లవారు జామున మూడు గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. ఈ స్పెషల్ రైలుకు 1ఏసీ 2టైర్, 3 ఏసీ త్రీ టైర్, 12 స్లీపర్ బోగీలు, 2 లగేజ్ కం బ్రేక్ వ్యాన్ బోగీలు ఉంటాయి. ఈ రైలుకు రిజర్వేషన్ టికెట్ బుకింగ్ ప్రారంభమైంది. ఈ రెండు స్పెషల్ రైళ్ల రాక పోకలలో కాజీపేట రైల్వే జంక్షన్, రామగుండం, బెల్లంపల్లి, సిర్‌పూర్ కాగజ్‌నగర్, బల్హార్ష, సేవాగ్రాం, నాగపూర్, ఇటార్సీ, జబల్‌పూర్, కంటి, శట్నా, మానిక్‌పూర్, అలహాబాద్ చౌకీ, పీటీ, దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్, బుక్సర్, ఆరా రైల్వే స్టేషన్‌లలో మాత్రమే ఆగుతుందని తెలిపారు. ఈ ఛాత్ ఉత్సవాలలో పాల్గొనే భక్తులు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేకంగా ప్రవేశ పెట్టిన రైళ్లను వినియోగించుకోవాలని కోరారు.

114
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...