దళిత వర్గాలకు వెన్నుదన్నుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం


Sat,October 19, 2019 03:28 AM

-ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్
రెడ్డికాలనీ, అక్టోబర్ 18: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ నాయకత్వంలో దళిత వర్గాలకు వెన్నుదన్నుగా నిలుస్తోందని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. కాకతీయ యూనివర్సిటీ పాలక మండలి సభ్యులుగా నియమితులైన చరిత్ర, టూరిజం విభాగం సీనియర్ ప్రొఫెసర్ కేయూ అడ్మిషన్ల డైరెక్టర్ ప్రొఫెసర్ తాళ్లపల్లి మనోహర్ శుక్రవారం చీఫ్‌విప్ వినయ్‌భాస్కర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కేయూ దూరవిద్య కేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ జీ వీరన్న ఆధ్వర్యంలో ఈసీ మెంబర్ ప్రొఫెసర్ మనోహర్‌కు వినయ్‌భాస్కర్ పుష్పగుచ్ఛం అందజేసి సన్మానించారు. ఈ సందర్భంగా చీఫ్‌విప్ వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నట్లు తెలిపారు. విద్య, ఉద్యోగాలతో పాటు నామినేటెడ్ పరిపాలన పదవుల్లోనూ తగిన భాగస్వామ్యం కల్పించినట్లు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం కేయూ ఈసీ నియామకం గెజిట్ విడుదల చేసిన తర్వాత ఎస్సీ, ఎస్టీలకు తగిన భాగస్వామ్యం కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చి ఈసీ మెంబర్‌గాప్రొఫెసర్ తాళ్లపల్లి మనోహర్‌కు పదవీ బాధ్యతలు కల్పించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలిండియా యూనివర్సిటీ ఎంప్లాయీస్ యూనియన్ ఉపాధ్యక్షుడు డాక్టర్ పుల్లా శ్రీనివాస్, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ బీ హన్మంతు, ఆర్గనైజింగ్ సెక్రటరీ బొల్నెపాక ప్రభాకర్, జమ్మికుంట జెడ్పీటీసీ డాక్టర్ శ్రీరాంశ్యాం, టీఆర్‌ఎస్వీ కేయూ అధ్యక్షుడు బైరపాక ప్రశాంత్, కార్పొరేటర్ బోడ డిన్నా, క్రిస్టియన్ యూనియన్ నాయకులు ఇమ్మానియేల్ పాల్గొన్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...