నేడు లక్కీ డ్రా


Fri,October 18, 2019 03:56 AM

-1885 మంది దరఖాస్తుదారుల్లో 59 మంది ఎవరు..?
-వారం రోజుల ఉత్కంఠకు నేటితో తెర
-అంబేద్కర్‌భవన్‌లో ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
-ఉదయం 11 గంటల నుంచి మద్యం షాపుల వారీగా డ్రా

వరంగల్ క్రైం, అక్టోబర్ 17: అదృష్టం ఎవరిని వరించనుంది.. లక్కు ఎవరి వైపు తొంగిచూడనుంది. 1885 మంది దరఖాస్తు దారుల్లో ఆ 59 మంది ఎవరు..? ఆ కిక్ వరించనుంది. వారం రోజులుగా జిల్లాలోని మద్యం షాపుల కోసం సాగిన పోటాపోటీ దరఖాస్తుల సమర్పణలో విజేతలుగా నిలిచేది ఎవరో తెలిసిపోనుంది. వరంగల్ అర్బన్ జిల్లాలో 59 వైన్ షాపులకు కనీవినీ ఎరుగని రీతిలో గతంలో కన్న అత్యధికంగా 1885 మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2019-21 సంవత్సరానికి గాను తీసుకువచ్చిన కొత్త మద్యం పాలసీకి చాలా మంది ఆకర్షితులై మద్యం షాపులు దక్కించుకోవడానికి దరఖాస్తు చేసుకున్నారు. పురుషులతో సమానంగా మహిళలు పోటీపడి దరఖాస్తులు చేశారు. క్లస్టర్ విధానంతో ట్రైసిటీలో సెల్స్ ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఒక్క షాపుకే పదుల సంఖ్యలో పొటీపడగా, స్లాబ్ రేట్ తక్కువ ఉన్న షాపులకు సైతం అత్యధిక సంఖ్యలో దరఖాస్తులు వేశారు. తమకే షాపు దక్కుతుందనే ధీమాతో వేచి చూస్తున్నారు.

పోటాపోటీగా దరఖాస్తులు
వరంగల్ అర్బన్‌లో ఎక్సైజ్ పీఎస్ పరిధిలోని 58 డివిజన్ ఆరెపల్లి మద్యం షాపు కోసం 58 మంది దరఖాస్తు చేశారు. ఆ తర్వాత గెజిట్ నెంబర్ 7, 1కి 31 మంది దరఖాస్తులు చేసుకున్నారు. గెజిట్ నెంబర్ 5 క్లస్టర్ 16, 17, 25, 26లో 27 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఖిలా వరంగల్ పరిధిలో గెజిట్ నంబర్ 12లో అత్యధికంగా 48 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆ తర్వాత ఐనవొలుకు 40 మంది పోటీ పడుతున్నారు. హన్మకొండ పరిధిలో గెజిట్ నంబర్ 33కు 56 మంది, 30కి 53 మంది దరఖాస్తు చేసుకున్నారు. కాజీపేట పరిధిలో వేలేరు మద్యంషాపునకు 79, ధర్మసాగర్ షాపునకు 60 దరఖాస్తులు వచ్చాయి.

ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
మద్యం షాపులకు ఈ నెల 9 నుంచి 16వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించారు. శుక్రవారం అంబేద్కర్‌భవన్‌లో 59 వైన్‌షాపులకు లక్కీ డ్రా నిర్వహించనున్నారు. ఏర్పాట్లను గురువారం సాయంత్రం కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ అధికారులకు పలు సూచనలు చేశారు. ట్రాఫిక్ ని యంత్రణ, హాల్ పరిసరాల్లో బందోబస్తుపై కాజీపేట ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్, సుబేదారి ఇన్‌స్పెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. దరఖాస్తు దారులు ఎంట్రిపాస్‌తో ఉదయం 10 గంటల లోపే హాల్‌లోకి రావాలని సూపరింటెండెంట్ బాలస్వామి తెలిపారు.

96
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...