బీఎస్-6తో యాక్టివా 125సీసీ


Fri,October 18, 2019 03:53 AM

సిద్ధార్థనగర్, అక్టోబర్ 17: నాగార్జున హోండా షోరూం ఆధ్వర్యంలో హంటర్‌రోడ్డులోని కాకతీయ గార్డెన్స్‌లో బీఎస్-6 హోండా యాక్టివా 125 సీసీ స్కూటర్‌ను గురువారం మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. సరికొత్త బీఎస్-6 నిబంధనలకు అనుగుణమైన ఇంజిన్‌తో ఈ వాహనాన్ని రూపొందించారని హెచ్‌ఎంఎస్‌ఐ ఏరియా ఇన్‌చార్జి సాగర్ తెలిపారు. సౌండ్ లేకుండానే ఇంజిన్ స్టార్ట్ అవుతుందని, ఎల్‌ఈడీ హెడ్‌లైట్స్, ఎల్‌ఈడీ టెయిల్ లైట్స్ దీని ప్రత్యేకతలు అని అన్నారు. సర్వీస్ డ్యూ ఇండికేటర్, రియల్ టైమ్ ప్యూయల్ ఎఫిసియెన్సీ, సైడ్‌స్టాండ్ ఇండికేటర్ ఉంటుందన్నారు. వాహనం రెడ్, బ్లూ, గ్రే, వైట్ కలర్స్‌లో లభించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్వీస్ మేనేజర్ మణిగంధన్, సబినిస్, షోరూం మేనేజింగ్ డైరెక్టర్ ముప్పసాని అరుణ్‌కుమార్, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

92
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...