క్రీడలతో మానసిక ఉల్లాసం


Fri,October 18, 2019 03:52 AM

డీజిల్ లోకో షెడ్ సీనియర్ డీఎంఈ శ్రీనివాస్
కాజీపేట, ఆక్టోబర్ 17: విధి నిర్వహణలో నిత్యం బిజీగా ఉండే రైల్వే కార్మికులు క్రీడలతో మానసిక ఉల్లాసం పొందవచ్చునని డీజిల్ లోకోషెడ్ సీనియర్ డీఎంఈ శ్రీనివాస్ అన్నారు. కాజీపేట రైల్వే జంక్షన్ పరిధిలోని రైల్వే ఇనిస్టిట్యూట్‌లో గురువారం ఆయన బిలియర్డ్స్, క్యారం క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షెడ్ కార్మికులు రైల్వే ఇనిస్టిట్యూట్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. భవిష్యత్‌లో షెడ్ ఇనిస్టిట్యూట్‌ను మరింత అభివృద్ధి చేసుకుందామన్నారు. కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ జోనల్ అధ్యక్షుడు కాలువ శ్రీనివాస్, ఇనిస్టిట్యూట్ శ్రీనివాస్, అసిస్టెంట్ సెక్రటరీ రమేశ్‌బాబు, కోశాధికారి శంకర్, సదానందం, సల్మాన్‌రాజ్, భాస్కర్‌రెడ్డి, వేద ప్రకాశ్, నర్సయ్య, సచిన్‌కుమార్, రైల్వే కార్మికులు పాల్గొన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...