మల్బరి సాగుతో అధిక లాభాలు


Fri,October 18, 2019 03:52 AM

-ములుగు రేర్స్ సైంటిస్ట్ సంజీవరావు
స్టేషన్‌ఘన్‌పూర్ నమస్తే తెలంగాణ, అక్టోబర్ 17 : మల్బరి సాగుతో అధిక లాభాలు పొందవచ్చని ములుగు రేర్స్ సైంటిస్ట్ సంజీవరావు రైతులకు సూచించారు. గురువారం మండలంలోని మీదికొండ గ్రామంలో ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో ఆత్మ సౌజన్యంతో పట్టు రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ములుగు రేర్స్ సైంటిస్ట్ సంజీవరావు పాల్గొని మాట్లాడారు. మల్బరి తోట పెంపకం నుంచి మొదలు పట్టుగూళ్ల అమ్మకం వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. రోగనిరోధక చర్యలు చేపడితే అధిక దిగుబడి సాధించవచ్చని వివరించారు. జిల్లా ఉద్యానశాఖ అధికారి కేఆర్ లత మాట్లాడుతూ ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖల ద్వారా అమలువుతున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు. అనంతరం జిల్లా పట్టు రైతు సంఘం అధ్యక్షుడు కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. పట్టుపురుగుల పెంపకం మంచి లాభాదాయకమన్నారు. శాస్త్రవేత్త ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. పట్టుపరిశ్రమకు అయ్యే ఖర్చు లాభాలను వివరించారు. పంట పండించేందుకు ప్రభుత్వం నుంచి ఒక మల్బరి పంటకు మాత్రమే ప్రోత్సాహకం అందుతుందన్నారు. ఒక కిలోకి అదనంగా రూ.75 ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేఖ, సర్పంచ్ మణెమ్మ, అర్టికల్చర్ ఏడీ అన్నారావు, స్టేషన్‌ఘన్‌పూర్ క్లస్టర్ లెవల్ ఉద్యానశాఖ అధికారి వీ అశోక్, తదితరులు పాల్గొన్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...