ఎస్సారెస్పీలో గోదారమ్మ పరవళ్లు


Fri,October 18, 2019 03:52 AM

వర్ధన్నపేట, నమస్తే తెలంగాణ, అక్టోబర్ 17 : ఎస్సారెస్పీ కాకతీయ ప్రధాన కాల్వలో గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి. నాలుగు రోజుల క్రితం మానేరు డ్యామ్ నుంచి ప్రభుత్వం ఎస్సారెస్పీ గోదావరి జలాలను విడుదల చేయడంతో ఎస్సారెస్పీ ఫేజ్ వన్ నుంచి రెండో దశ ప్రధాన కాల్వకు అందాయి. గురువారం రాయపర్తి మండలంలోని మైలారం రిజర్వాయర్‌కు నీరు చేరుకున్నాయి. మొదటి ఫేజ్‌లో చివరగా ఉన్న ఇల్లంద క్రస్ట్ గేట్ నుంచి కింద ఉన్న రెండో దశ నుంచి గోదావరి జలాలు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో కిందిప్రాంత రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది గత ఆరేళ్లలో ఎన్నడూలేని విధంగా సమృద్ధిగా వర్షాలు కురవడంతో చెరువులు, కుం టలు నిండాయి. చాలా గ్రామాల్లో చెరువులు మత్తళ్లు కూడా పడుతుండడంతో యాసం గి పంటలు కూడా సమృద్ధిగా పండుతాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎస్సారెస్పీ జలాలను కూడా కాకతీయ కాల్వల ద్వారా ప్రభుత్వం విడుద ల చేయడంతో మైలారం రిజర్వాయర్ నుంచి రెండో దశ ఎస్సారెస్పీ పరిధిలోని నల్లగొండ జిల్లా వరకు కూడా గోదావరి జలాలను అందనున్నాయి. అంతేగాక కాకతీయ కాల్వకు అనుబంధంగా ఉన్న ఉపకాల్వల ద్వారా చెరువులకు కూడా నీరు అందించేందుకు మంత్రి దయాకర్‌రావు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ ప్రయత్నాలు చేస్తుండడంతో అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

75
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...