డ్రాపౌట్ విద్యార్థులకు ఓపెన్ స్కూల్ ఒక వరం


Thu,October 17, 2019 03:46 AM

హసన్‌పర్తి, అక్టోబర్ 16: డ్రాపౌట్ విద్యార్థులకు ఓపెన్ స్కూల్ విధానం ఒక వరమని ఓపెన్ స్కూల్ జిల్లా కో-ఆర్డినేటర్ మురాల శంకర్‌రావు అన్నారు. గ్రేటర్ 55వ డివిజన్ ఎల్లాపూర్ ప్రభుత్వ పాఠశాలలో ఓపెన్ స్కూల్ అధ్యాయన కేంద్రాన్ని ఆయన బుధవారం ప్రారంభించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి చేతుల మీదుగా వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శంకర్‌రావు మాట్లాడుతూ.. 2019-20 విద్యా సంవత్సరానికి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎల్లాపూర్‌కు ఓపెన్ స్కూల్ పదోతరగతి, ఇంటర్మీడియేట్ అధ్యాయన కేంద్రాన్ని మంజూరి చేసినట్లు వివరించారు. బడి మానేసిన పిల్లలకు, ఇంటి వద్దే ఉండి చదువుకునే విద్యార్థులకు ఓపెన్ స్కూల్, ఇంటర్మీడియేట్ అధ్యాయన కేంద్రాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. ఓపెన్ పదో తరగతి, ఇంటర్‌లో అడ్మీషన్ పొందుటకు ఈ నెల 21 వరకు, నిర్ణీత అపరాధ రుసుముతో ఈ నెల 31 వరకు అడ్మీషన్లు పొందవచ్చని సూచించారు. హెచ్‌ఎం విజయలక్ష్మీ మాట్లాడుతూ.. చదువు మానేసినవారు ఈ అధ్యాయన కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు ఉపాధ్యాయుడు సరోత్తంరెడ్డి సెల్ నం. 8328247163లో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో అమ్మా మైటీ హోప్స్ స్వచ్చంధ సంస్థ ప్రతినిధులు సుహాసిని, విజయ, కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.

83
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...