చెత్త డంపింగ్ యార్డులను వినియోగించాలి


Thu,October 17, 2019 03:45 AM

-ఎంపీడీవో విజయ్‌కుమార్
కమలాపూర్: గ్రామాల్లో చెత్త డంపింగ్ యార్డులను వినియోగంలోకి తీసుకురావాలని ఎంపీడీవో విజయ్‌కుమార్ అన్నారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ఈనెల 25 నుంచి డంపింగ్ యార్డుల్లో చెత్త వేసేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ట్రై సైకిళ్లతో డంపింగ్ యార్డులకు చెత్తను తరలించాలని, సూచికలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వైకుంఠదామాలను ఈనెల ఆఖరులోగా వినియోగంలోకి తీసుకురావాలన్నారు. నర్సరీల్లో కంచె ఏర్పాటు చేయాలని సూచించారు. రోడ్ల వెంట నాటిన మొక్కలు చనిపోతే మళ్లీ నాటించి, ట్రీ గార్డులు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విజిలెన్స్ అధికారి నర్సింహారెడ్డి, ఏపీవో రమేశ్, ప్లాంటేషన్ అధికారి సంపత్, ఈసీ కార్తీక్, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధిహామీ టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు.

70
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...