57 శాతం టికెట్ జర్నీ


Thu,October 17, 2019 03:45 AM

సుబేదారి, అక్టోబర్ 16: ఆర్టీసీ బస్సుల్లో టిక్కె ట్ ప్రయాణం మొదలైంది. కార్మికుల సమ్మెతో ప్రైవేట్ డ్రైవర్లు, కండక్టర్లతో అందిస్తున్న ప్రత్యా మ్నాయ సేవలు విజయవంతంగా సాగుతున్నా యి. సమ్మె ప్రారంభం నుంచి పది రోజుల పాటు ప్రయాణికులకు టికెట్ ఇవ్వకుండా డబ్బులు వ సూలు చేసేవారు. అయితే కొన్ని చోట్ల అధిక చా ర్జీలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలతో ఆర్టీసీ అధికారులు తక్షణమే స్పందించి టికెట్ విధానా న్ని అమల్లోకి తెచ్చారు. బుధవారం వరంగల్ రీజియన్‌లో 676 సర్వీస్‌లు తిరిగాయి. వీటిల్లో 340 పైగా బస్సుల్లో (57 శాతం) కండక్టర్లు మ్యానువల్‌గా టికెట్ పద్ధతి, టిమ్స్‌తో టికెట్లు ఇచ్చారు. దీంతో ఆర్టీసీకి రావాల్సిన ఆదాయానికి బాటలుపడ్డాయి. ఇక నుంచి డిపో, రూటు వారీగా నడిచిన బస్సులు, వచ్చిన ఆదాయంపై రోజువారీగా లెక్కలు సంస్థకు అప్పజెప్పాల్సి ఉంటుంది.

అన్ని రూట్లకు సర్వీస్‌లు
వరంగల్ రీజియన్‌లో తొమ్మిది డిపోలు ఉన్నాయి. వీటిల్లో మొత్తం బస్సులు 930 ఉండ గా.. ఇందులో అద్దె బస్సులు 230. రీజియన్‌లో 348 రూట్లు ఉన్నాయి. సమ్మెకు ముందు ప్రతిరోజూ 700 బస్సులకు పైగా నడిచివేవి. కార్మికుల సమ్మె ప్రారంభం మొదటి, రెండు రోజుల్లో వంద నుంచి 150 బస్సులు మాత్రమే రోడ్డు ఎక్కాయి. వారం వరకు 50శాతం, ఇప్పుడు 80శాతానికి పైగా బస్సులు రోడ్లపై పరుగులు పెడుతున్నాయి. 348 రూట్లలో దాదాపుగా 320 రూట్లకు బస్సులు నడిపిస్తున్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...