గ్రామాల అభివృద్ధికి కృషిచేయాలి


Wed,October 16, 2019 01:54 AM

దామెర, అక్టోబర్ 15 : గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని డీఎల్పీవోలు అన్నారు. ఈ మేరకు మంగళవారం మండలాల్లో అధికారులు , ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. దామెర మండల పరిషత్ కార్యలయంలో ఎంపీపీ కాగితాల శంకర్ అధ్యక్షతన 30 రోజల ప్రణాళికలపై కార్యర్శులు, సర్పంచ్‌లు, ఈజీఎస్ సిబ్బందితో డీఎల్పీవో కల్పన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డులకోసం స్థలాలను సేకరించాలని, ఈజీఎస్‌లో కొత్తగా నర్సరీల ఏర్పాటుకు స్థలాను గుర్తించాలని ఆదేశించారు. పంచాయతీ సిబ్బందితో ఎప్పటికప్పుడు గ్రామంలోని చెత్తచెదారం తొలగించాలని అన్నారు. ఈ సమీక్షా సమావేశంలో ఎంపీపీ కాగితాల శంకర్, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, ఎంపీవో యాదగిరి, సర్పంచ్‌లు విష్ణువర్ధన్ రెడ్డి, పున్నం రజిత,గోవిందు అశోక్, రజిత, కుక్క శ్రావణ్య, సాంబయ్య, సత్యనారాయణ రెడ్డి, యాదారాజేశ్వరి, శ్రీనివాస్, సరోజనారెడ్డి, రాణి, శ్రీరాంరెడ్డి, రాజేందర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.

ఆత్మకూరు : గ్రామాల్లో నిరంతరం అభివృద్ధి జరగాలని డీఎల్పీవో కల్పన అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచ్‌లు, కార్యదర్శులు,ఫీల్డ్ అసిస్టెంట్లతో 30 రోజుల ప్రణాళికలో భాగంగా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల వారీగా వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ 30 రోజుల ప్రణాళికలో గుర్తించిన పనులను త్వరతగతిన పూర్తి చేయాలన్నారు. ఆన్‌లైన్‌లో పూర్తి చేసిన రికార్డులను పరిశీలిస్తూ సర్పంచ్‌లు, కార్యదర్శులను పనుల పురోగతిపై అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ మార్క సుమలత, ఎంపీడీవో నర్మద, ఈవోపీఆర్డీ చేతన్‌రెడ్డి, ఏఈ రవికుమార్, సర్పంచ్‌లు పాల్గొన్నారు.

తీర్మానాలను అమలు పర్చాలి
రాయపర్తి : మండలంలోని అన్ని పంచాయతీల్లో పాలక మండళ్లు, గ్రామసభల సంపూర్ణ ఆమోదం మేరకు తీసుకున్న తీర్మానాలను అమలు పరచాలని డీఎల్పీవో నాగపురి స్వరూప అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో రామ్మోహనచారి అధ్యక్షతన 30 రోజుల ప్రత్యేక ప్రణాళిక కార్యక్రమాల అమలు తీరుపై సర్పంచ్‌లు, కార్యదర్శులు, ఈజీఎస్ ఉద్యోగులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం పలు అభివృద్ధి విషయాలపై ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి సభలో చర్చించారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ రంగు కుమార్‌గౌడ్, ఏపీవో కుమార్‌గౌడ్, మండల పరిషత్ సిబ్బంది పాల్గొన్నారు.

ప్రజల భాగస్వామ్యంతోనే విజయవంతం
దుగ్గొండి : 30 రోజుల ప్రణాళిక ప్రజల భాగస్వామ్యంతోనే విజయవంతమైందని డీఎల్పీవో వెంకటేశ్వర్లు అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో 30 రోజుల ప్రణాళిక అమలుపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్‌ల కృషి అభినందనీయమన్నారు. ఈ సమావేశంలో అధికారులు హరిప్రసాద్, సర్పంచ్‌లు పాల్గొన్నారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...