మోడల్ మార్కెట్ రెడీ


Tue,October 15, 2019 03:48 AM

-కూరగాయల విక్రయానికి అనుగుణంగా నిర్మాణం
-91 షాపులతోపాటు 101 ప్లాట్ ఫాంలు
-త్వరలో మార్కెటింగ్‌శాఖకు అప్పగింత
-మార్కెట్ పరిసరాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసిన ఉన్నతాధికారులు
-తీరనున్న చిరువ్యాపారుల కష్టాలు
-ప్రారంభోత్సవానికి అధికారుల ఏర్పాట్లు
-వివరాలు మధ్యపేజీల్లో

వరంగల్ చౌరస్తా, అక్టోబర్ 14: మోడల్ మార్కెట్ సిద్ధమైంది. వరంగల్ లక్ష్మీపురానికి సరికొత్త హంగులు తెచ్చింది. అడుగు దూరంలో ప్రారంభానికి వేచి చూస్తోంది. సకల సౌకర్యాలు, ఆధునిక హంగులతో ఉట్టిపడుతోంది. ఈ ఒక్క నిర్మాణం దశాబ్దాల కాలంగా ఇటు కూరగాయల వ్యాపారులు అటు వినియోగదారులు పడుతున్న ఇబ్బందులకు స్వస్థి పలుకనుంది. ప్రభుత్వం మోడల్ మార్కెట్‌కు పునాది వేసి..సమస్యలను పారద్రోలింది. వ్యాపార అవసరాలకు తగినట్లుగా నిర్మాణం, విద్యుత్ సౌకర్యాలు, విశాలమైన స్థలం ఇలా ఎన్నో ఈ మోడల్ మార్కెట్‌లో కొలువుదీరాయి. త్వరలో మార్కెటింగ్‌శాఖ అధికారులు కాంట్రాక్టర్ నుంచి మార్కెట్‌ను స్వాధీనం చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. కొత్తగా నిర్మించిన మోడల్ కూరగాయల మార్కెట్‌లో 91షాపులతో పాటుగా సుమారు 101 ప్లాట్ ఫాంలను నిర్మించారు. దీంతో పాటుగా మార్కెట్ అవరణలోనే రైతులు తీసుకువచ్చిన కూరగాయలను వేలం వేయడానికి తూకం వేయడానికి అనువుగా స్థలాన్ని ఏర్పాటు చేశారు. ఇన్నాళ్లు ఇరుగ్గా ఉన్న కూరగాయల మార్కెట్‌లో వ్యాపారాలు నిర్వహించడానికి ఇబ్బందులుపడిన వ్యాపారులు విశాలమైన ఆవరణలో వ్యాపారాన్ని నిర్వహించుకోనున్నారు.

ముస్తాబవుతున్న షాపులు..
మోడల్ కూరగాయల మార్కెట్‌ను మార్కెటింగ్‌శాఖకు అప్పగించడానికి వేగంగా ముస్తాబు చేస్తున్నారు. ఈమేరకు మార్కెట్ ఆవరణకు పూర్తిగా లేత, ముదురు ఆకుపచ్చ రంగులు వేయడంతో పాటుగా మార్కెట్‌లో వ్యాపారులు కొనుగోలు చేసిన కూరగాయలకు గాలి, వెలుతురు తగిలేలా ఉండడానికి, నిల్వ చేసుకోవడానికి వీలుగా ముందు భాగంలో గ్రిల్స్‌తో చేట్టిన నిర్మాణానికి రంగులు వేశారు. దీంతో మోడల్ మార్కెట్‌కు కొత్త కల వచ్చింది. మోడల్ మార్కెట్ పూర్తి కావడంతో వ్యాపారులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

అడుగు దూరంలో..
మోడల్ మార్కెట్‌ను వ్యవసాయ మార్కెటింగ్‌శాఖ అధికారులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితం వరంగల్ మార్కెట్ కార్యదర్శి నూతనంగా నిర్మించిన మోడల్ మార్కెట్‌లో కరంటు పనులు పరిశీలించారు. ఇంజినీరింగ్ విభాగం అధికారులు తనిఖీలు నిర్వహించి నిబంధనలకు లోబడి నిర్మాణం పూర్తి చేసినట్లు ధ్రువీకరిస్తే మార్కెటింగ్ శాఖ చేతికి మార్కెట్ వెళ్లనుంది. ఈ మేరకు ఇంజినీరింగ్ విభాగంతో పాటుగా ఉన్నతాధికారులు అన్ని బ్లాకులను పరిశీలించినట్లు సమాచారం.

93
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...