పొదుపు సంఘాలు ఆర్థిక ప్రగతి సాధించాలి


Tue,October 15, 2019 03:46 AM

భీమదేవరపల్లి: సభ్యుల పరస్పర సహకారం వల్లనే పొదుపు సంఘాలు ఆర్థిక ప్రగతి సాధిస్తాయని సహవికాస సంస్థ మేనేజర్ లక్ష్మణ్ అన్నారు. సోమవారం మండలంలోని ములుకనూరు పురుషుల పొదుపు సమితి-2 సాధారణ సమావేశం గాజుల సతీశ్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొదుపు సంఘాలు నిజాయితీగా పనిచేస్తేనే ఉత్తమ ఫలితాలు వస్తాయని చెప్పారు. సమితి ఆధ్వర్యంలో 12 సంఘాలు ఉండగా 6500 మంది సభ్యులు ఉన్నట్లు తెలిపారు. రూ. 11 కోట్ల టర్నోవర్‌తో పొ దుపు సమితి కొనసాగుతుందన్నారు. సభ్యులు బకాయి లేకుండా ప్రతి నెల క్రమం తప్పకుండా పొదుపు, అప్పులు చెల్లించేలా సంఘం పాలకవర్గాలు బాధ్యత తీసుకోవాలని సూచించారు. 18 ఏళ్లు నిండిన వారిని సంఘాల్లో సభ్యులుగా తీసుకోవాలని వివరించారు. కార్యక్రమంలో సీడీఎఫ్ డీవో రవీందర్, డీఏ మంజుల, ములుకనూరు పొదుపు సమితి-1 అధ్యక్షులు జాన ప్రవీణ్, కొత్తపల్లి మహిళా పొదుపు సమితి అధ్యక్షురాలు శారద, ఉపాధ్యక్షులు చినరాములు, సంఘాల అధ్యక్షులు సమ్మయ్య, ప్రతాపరెడ్డి, సాంబరాజు, సుమన్, రవీందర్, శ్రీని వాస్, సుధాకర్, కనుకయ్య, ఎం డీ అంకూశ్, సమితి, సంఘాల గణకులు నీలం భిక్షపతి, రవీందర్, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...