ప్రధాన రహదారి పక్కన ప్రమాదకరంగా చెట్టు


Tue,October 15, 2019 03:46 AM

హసన్‌పర్తి, అక్టోబర్ 14: గ్రేటర్ 56వ డివిజన్ కేంద్రం కరీంనగర్-హన్మకొండ ప్రధాన రహదారి పక్కనే ఉన్న మహావృక్షం ప్రమాదకరంగా ఉంది. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే కరీంనగర్-హన్మకొండ ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఓ మహావృక్షం ఎండిపోయి గాలి దుమారానికి ఎప్పుడు కూలిపోయి ఏం ప్రమాదం ముంచు కొస్తుందోనని స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ విషయంపై నేషనల్ హైవే, ఆర్ అండ్ బీ అధికారులు తక్షణమే స్పందించి ఎండిపోయిన వృక్షాన్ని తొలగించి ప్రమాదాల నివారణకు కృషి చేయాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.

77
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...