హుజూర్‌నగర్‌లో టీఆర్‌ఎస్‌దే గెలుపు


Tue,October 15, 2019 03:46 AM

-మేయర్ గుండా ప్రకాశ్‌రావు శ్రేణులతో కలిసి హుజుర్‌నగర్‌లో విస్తృత ప్రచారం
వరంగల్,నమస్తేతెలంగాణ : హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ భారీ మెజారిటీతో గెలువడం ఖాయమని గ్రేటర్ వరంగల్ నగర మేయర్ గుండా ప్రకాశ్‌రావు అన్నారు. సోమవారం ఆయన హుజూర్‌నగర్ నియోజకవర్గం పరిధిలోని గరిడేపల్లి, నేడింజర్ల మండలాల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి టీఆర్‌ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డిని గెలిపించాలనిఆయన ఓటు అభ్యర్థించారు. ఆర్యవైశ్య కులస్తులు, సంఘాలను కలుస్తూ టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా మేయర్ గుండా ప్రకాశ్‌రావు మాట్లాడుతూ హుజూర్ నగర్ నియోజకవర్గం అభివృద్ధిలో ముందుకు పోవాలంటే టీఆర్‌ఎస్ అభ్యర్థి సైదిరెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఆయనవెంట స్థానిక నేతలతో పాటు ఆర్యవైశ్య సంఘం నాయకులు, టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...