పంగిడిపల్లి టు శబరిమల


Tue,October 15, 2019 03:45 AM

-అయ్యప్ప భక్తుడు శంకర్‌రావు మహాపాదయాత్ర
కమలాపూర్: మండలంలోని పంగిడిపల్లి గ్రామానికి చెందిన అయ్యప్ప స్వామి భక్తుడు జమలాపురం శంకర్‌రావు శబరిమలకు మహాపాదయాత్రగా బయలుదేరాడు. 18 సార్లు అయ్యప్ప మాల ధరించిన శంకర్‌రావు శబరికి వెళ్లి మాల విరమణ చేయనున్నారు. పంగిడిపల్లి గ్రామంలోని మణీశ్వర అయ్యప్ప స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు చేసిన ఆయన మహాపాదయాత్రగా బయలు దేరగా గ్రామస్తులు డప్పుచప్పుళ్లు, మంగళహారతులతో సాగనంపారు. మొదట గా శంకర్‌రావు కరీంనగర్ చేరుకుని, అక్కడి నుంచి మరో 40 మందితో పాదయాత్రగా శబరిమలకు బయలు దేరనున్నట్లు గ్రామస్తులు చెప్పారు. 40రోజులపాటు పదహారు వందల కి.మీ మహాపాదయాత్ర చేపట్టి శబరిమల చేరుకుంటారని తెలిపారు. కాగా ఇదే గ్రామానికి చెందిన మోకిడె సాంబయ్య 1997లో శబ రిమలకు పాదయాత్ర చేసినట్లు తెలిపారు. సర్పం చ్ శ్రీనివాస్, అర్చకుడు సురేంద్రశర్మ, గురుస్వాములు రాజేశ్వర్‌రావు, సాంబయ్య, శ్రీనివా స్, చిందె చందర్‌రావు, శాంతాజీ, బెజ్జంకి రమణాచారి, గ్రామస్తులు శంకర్‌రావును సాగనంపారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...