గిరిజన గూడేలకు త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరా


Tue,October 15, 2019 03:45 AM

వరంగల్ సబర్బన్, నమస్తే తెలంగాణ : గిరిజన గూడేలకు త్రీ ఫేజ్ విద్యుత్‌ను సరఫరా అందించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ అన్నమనేని గోపాల్‌రావు ఆదేశించారు. కంపెనీ డైరెక్టర్లు వెంకటేశ్వర్ రావు, నర్సింగారావు, సంధ్యారాణి, మోహన్‌రెడ్డిలతో కలిసి 16 జిల్లాల సూపరింటెండెండ్ ఇంజినీర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. ఈ నెల 17 లోపు యుద్ధప్రాతిపాదికన గిజజన గ్రామాల్లో సింగిల్ ఫేజ్ కనెక్షన్ల జాబితాను తయారు చేయాలని ఆదేశించారు. ఈ పనిని ఆత్యంత ప్రాధాన్యత క్రమంలో తీసుకుని పని చేయాలని అన్నారు. దీంతో పాటు పవర్ వీక్ కార్యక్రమంలో భాగంగా మిగిలి పోయిన లూజ్ లైను పనులతో పాటు తుప్పు పట్టిన, వంగిన స్తంభాలను సరి చేయాలని చెప్పారు. ప్రతి ట్రాన్స్‌ఫార్మర్‌కు తప్పని సరిగా ఎర్తింగ్ ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. నివాస గృహాల నుంచి వెళ్లే విద్యుత్ లైన్లను గుర్తించి ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. నగరాలు, పట్టణాల్లో కూడా పవర్ వీక్ కార్యక్రమాన్ని నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని గుర్తు చేస్తూనే, సీఎం చెప్పిన అన్ని పనులను పూర్తి చేసి మన లక్ష్యాన్ని పూర్తి చేయాలని గుర్తుచేశారు. ఇటీవల జరిగిన సమీక్ష సమావేవంలో ముఖ్యమంత్రి విద్యుత్ శాఖను ప్రత్యేకంగా అభింనందించడం మనకు గర్వకారణమని అన్నారు. వీధి దీపాలకు వంద శాతం మీటర్లను బిగించాలని ఆదేశించారు. కార్యక్రమంలో సీజీఎంలు అశోక్ కుమార్, సదర్‌లాల్, కిషన్, నగేశ్, ప్రభాకర్, అశోక్, తిరుపతిరెడ్డి, జీఎంలు వెంకటరమణ, నాగం ప్రసాద్, బీకంసింగ్, గౌతంరెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...