తొమ్మిదో రోజు 625 బస్సులు..


Mon,October 14, 2019 04:20 AM

-సాఫీగా ఆర్టీసీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
-ప్రయాణికుల కోసం మెరుగైన సేవలు
-తాత్కాలిక డ్రైవర్, కండక్టర్, మెకానికల్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ

సుబేదారి, అక్టోబర్13: ఆర్టీసీ ప్రత్యామ్నాయ సేవలతో ప్రయాణికులు సాఫీగా గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నా.. ప్రగతి చక్రాలు పరుగులు తీస్తున్నాయి. సమ్మె తొమ్మిదో రోజు ఆదివారం తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు 625 బస్సులు ప్రయాణికులకు సేవలందించాయని ఆర్టీసీ రీజినల్ మేనేజర్ శ్రీధర్ తెలిపారు. సమ్మె ప్రారంభం నుంచి డిపోల మేనేజర్లు, రీజియన్ అధికారులు బస్సులను నడిపిస్తూ ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకుంటున్నారు. డిపోలో మేనేజర్, ఆర్టీఏ అధికారుల సమక్షంలో ప్రైవేట్ డ్రైవర్లకు ఫిట్‌నెస్ టెస్ట్ నిర్వహించి బస్సులు అప్పగిస్తున్నారు. అలాగే అధిక చార్జీల వసూళ్లను నిలువరించడానికి టికెట్ పద్ధతిని అమలు చేయడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దసరా సెలవులను ఈనెల 19వ తేదీ వరకు పొడిగించడంతో ఆదివారం ప్రయాణికుల రద్దీ అంతంత మాత్రంగానే ఉంది. ఆర్టీసీ ప్రత్యామ్నాయ సేవలు ఒకవైపు సక్సెస్‌గా కొనసాగుతుండగా.. ఆర్టీసీ కార్మికులు తమ నిరసనను తెలియజేస్తూనే ఉన్నారు.

71
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...