సభ్యులు సకాలంలో అప్పులు చెల్లించాలి


Mon,October 14, 2019 04:18 AM

భీమదేవరపల్లి: పొదుపు సంఘాల్లో ప్రతీ సభ్యుడు సకాలంలో అప్పులు చెల్లించాలని సహవికాస సంస్థ కోశాధికారి రేవతి అన్నారు. ఆదివారం మండలంలోని ములుకనూరు పురుషుల పొదుపు సమితి-1 సాధారణ సమావేశం అధ్యక్షుడు జాన ప్రవీణ్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పొదుపు సమితి ఆధ్వర్యంలో 13 సంఘాలు ఉండగా 6500 మంది సభ్యులు ఉన్నట్లు తెలిపారు. సమితి నిధులు రూ. 11కోట్లు ఉండగా రూ. 9 కోట్లు సభ్యులకు రుణాలు ఇచ్చినట్లు చెప్పారు. సభ్యుల నిధులు సవ్యంగా ఉండాలంటే సంఘాల్లో సభ్యుల పర్యవేక్షణ విధిగా జరగాలని సూచించారు. సభ్యులు బకాయి లేకుండా ప్రతీ నెల క్రమం తప్పకుండా పొదుపులు, అప్పులు చెల్లించేలా సంఘం పాలకవర్గాలు బాధ్యత తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సీడీఎఫ్ డీవో రాజశ్రీ, డీఏ మంజుల, ములుకనూరు పొదుపు సమితి-2 అధ్యక్షులు గాజుల సతీశ్, ఉపాధ్యక్షులు మండ శ్రీనివాస్, సంఘాల అధ్యక్షులు మురళీకృష్ణ, తిరుపతిరెడ్డి, రవీందర్, రాంబాబు, సదయ్య, తిరుపతి, సురేందర్, రాజయ్య, శ్రీనివాస్, సమితి గణకులు నీలం భిక్షపతి, గజ్జల రవీందర్, గణకులు, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...