కొత్తవాడలో రాములుకు సన్మానం


Mon,October 14, 2019 04:17 AM

పోచమ్మమైదాన్, అక్టోబర్ 13: ప్రపంచ కాటన్ దినోత్సవం సందర్భంగా స్విజ్జర్లాండ్‌లోని జెనీవాలో జరిగిన సదస్సులో పాల్గొన్న జాతీయ చేనేత అవార్డు గ్రహీత, కొత్తవాడ చేనేత కార్మికుడు పిట్ట రాములును ఆదివారం సన్మానించారు. ఇటీవల జరిగిన ప్రపంచ దేశాల ప్రదర్శనలో ఇండియా తరపున కొత్తవాడకు చెందిన రాములు వెళ్లిన విషయం విధితమే. జెనీవాలో 129 దేశాల ప్రధానమంత్రులు పాల్గొన్న సదస్సులో నూలు వడికే విధానాన్ని రాట్నం ద్వారా ప్రదర్శించి, తెలంగాణ రాష్ట్ర ఔన్నత్వం గురించి వివరించారు. అలాగే ఇండియా నుంచి పాల్గొన్న కేంద్ర జౌళిశాఖ మంత్రి స్మృతి ఇరానీ కూడా రాములు ప్రతిభను గుర్తించి ప్రశంసించారు. ఈ సందర్భంగా మన దేశ గొప్పతనం, నూలు వడికిన మహాత్మాగాంధీ వారసత్వాన్ని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పిన రాములును స్థానిక చేనేత సంఘాల ప్రతినిధులు, కార్మికులు సత్కరించారు. కార్యక్రమంలో వీవర్స్ డెవలప్‌మెంట్ ఫౌండేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిప్ప వెంకటేశ్వర్లు ఎం.నటరాజన్, ఆడెపు రవి, ఎస్‌డీ నజీర్, వెంగల మొగిలి, చిలుకనూరి శ్రీనివాస్, చంద్ర మొగి లి, స్వామి, రాజా,శారద, సుగుణ, సరళ, స్వరూప పాల్గొన్నారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...