కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతం


Mon,October 14, 2019 04:17 AM

మహదేవపూర్/కాళేశ్వరం, అక్టోబర్ 13 : రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమని విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి వారు అన్నారు. ఆదివారం ఆయన లక్ష్మీ(కన్నెపల్లి)పంప్‌హౌస్, లక్ష్మీ(మేడిగడ్డ) బరాజ్‌లను సందర్శించారు. స్వామి వారు ముందుగా కాళేశ్వరంలోని ముక్తీశ్వరస్వామి వారిని దర్శించుకుని అక్కడి నుంచి లక్ష్మీ(కన్నెపల్లి )పంప్‌హౌస్ సందర్శణకు వెళ్లారు. అక్కడ ప్రాజెక్టు ఈఈ రమణారెడ్డి స్వామి వారికి స్వాగతం పలికారు. అక్కడి నుంచి వ్యూపాయింట్ వద్దకు చేరుకొని పంపుహౌస్‌ను సందర్శించిన అనంతరం స్వామివారికి మ్యాపు ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా పంపుహౌస్ వద్ద పని చేస్తున్న మోటర్ల వివరాలు, వాటి పనితీరును వివరించారు. పంప్‌హౌస్ నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా 13.02కిలోమీటర్ల వరకు నీరు ప్రవహించి సరస్వతీబరాజ్‌లో కలుస్తాయని తెలిపారు.

లక్ష్మీబరాజ్(మేడిగడ్డ)కు చేరుకుని బరాజ్ హోమశాల వ్యూ పాయింట్ వద్ద గోదావరి మాతకు పట్టుచీర, పూలు, పండ్లు, కుంకుమ సమర్పించారు. అనంతరం స్వామి వారు మాట్లాడుతూ ఇంత తక్కువ సమయంలో పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్టు అద్భుతమని అన్నారు. తెలంగాణ ప్రజల అసరాలను గుర్తించిన సీఎం కేసీఆర్ ఈ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ప్రాజెక్టుతో తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని అన్నారు. ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈఈ వెంకటరమణరెడ్డి, డీఈ సురేశ్, భక్తులు ఉన్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...