తొమ్మిది మందికి అవయవదానం


Sun,October 13, 2019 02:04 AM

ఎల్కతుర్తి : తాను మరణిస్తూ మరో 9మందికి జీవితాన్ని ఇచ్చాడు ఓ ఆదర్శ వ్యక్తి. తన శరీరంలోని అవయవాలను దానం చేసి మరణానంతరం కూడా ఔరా అనిపించుకుని తనకే కాకుండా తన కుటుంబసభ్యులకు కూడా మంచి పేరు తెచ్చా డు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని పెంచికల్‌పేట గ్రామానికి చెందిన రాంపెల్లి రవీంద్రాచారి (50) ఈ నెల 2న ప్రమాదవశాత్తు గాయపడి బ్రెయిన్‌డెడ్‌ అయి హైదరాబాద్‌లోని గ్లోబల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే ఆస్పత్రి వైద్యుల కోరిక మేరకు రవీంద్రాచారి భార్య సత్య, కుమారులు సాయికృష్ణ, విజయ్‌కుమార్‌ సైతం అతడి అవయవాలను దానం చేయడానికి ఒప్పుకున్నారు. దీంతో రవీంద్రాచారి గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు, లివర్‌, 2 నేత్రాలు దానం చేసి మరో 9మంది జీవితాల్లో వెలుగు నింపాడు. రవీంద్రాచారి లివర్‌ ముగ్గురికి, గుండె, ఊపిరితిత్తులు ఒక్కొక్కరికి, కిడ్నీలు ఇద్దరికి, నేత్రాలు ఇద్దరు అంధుల జీవితాలకు వెలుగునిచ్చాయి. ఈ సందర్భంగా అవయవదానం చేసినందుకు 9మంది కుటుంబసభ్యులు వీరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రవీంద్రాచారి కర్మకాండ (11వ రోజు) కార్యక్రమం శనివారం పెంచికల్‌పేటలో జరిగింది.

ఇందులో భాగంగా తెలంగాణ నేత్ర, అవయవ, శరీర దాతల అసోసియేషన్‌ వరంగల్‌ ఆధ్వర్యంలో సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రవీంద్రాచారి, అతని కుటుంబసభ్యులకు అసోసియేషన్‌ తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపి, నేత్ర, శరీర అవయవదానంపై అవగాహన కల్పించారు. మరణానంతరం 6గంటల్లోపు నేత్రదానం చేయా లని అసోసియేషన్‌ అధ్యక్షుడు మల్లారెడ్డి చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సామల జమునసురేష్‌రెడ్డి, ఉప సర్పంచ్‌ ముప్పు కుమార్‌, వార్డు సభ్యుడు ముప్పు రమేశ్‌, అవయవదానం జిల్లా అధ్యక్షుడు కొన్‌రెడ్డి మల్లారెడ్డి, సభ్యులు పెండ్లి ఉపేందర్‌రెడ్డి, కోటి శంకర్‌యాదవ్‌, హైదరాబాద్‌ జీవన్‌దాన్‌ సంస్థ పీఆర్వో పవన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...