తేమ పేరుతో కొనుగోళ్లు నిరాకరణ


Sat,October 12, 2019 02:55 AM

-వ్యాపారుల తీరుతో మక్క రైతుల ఇబ్బందులు
కాశీబుగ్గ, అక్టోబర్ 11: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లోని అపరాల యార్డులో తేమ పేరుతో మక్కలు కొనుగోలు చేయకుండా వ్యాపారులు నిరాకరించడంతో రైతులు ఇ బ్బందులకు గురయ్యారు. ప్రస్తుతం వర్షాల నేపథ్యంలో రైతులకు మక్కలు ఆరబోసుకునేందుకుగాను గ్రామాల్లో స్థలం లేకపోవడంతో తేమతోనే మార్కెట్‌కు తీసుకువచ్చారు. దీంతో కరీ దు వ్యాపారులు తేమ అధికంగా ఉందని కొనుగోలు నిలిపివేయడంతో దిక్కుతోచని స్థితిలో మార్కెట్ పరిధిలోని సీసీ రోడ్లపైనే ఆరబోసుకున్నారు. సద్దులు, దసరా పండుగను పురస్కరించుకొని మార్కెట్‌కు వరుసగా నాలుగు రోజులు సెలవులు రావడంతో శుక్రవారం రైతుల మక్కలు పెద్ద ఎత్తున తీసుకువచ్చారు. కాగా 926 బస్తాల మక్కలను గరిష్టంగా క్వింటాళ్లుకు రూ. 2180, మధ్యరకం రూ.2031, కనిష్టంగా 1751 ధరలతో కొ నుగోలు చేశారు. మరో 1500 బస్తాల మక్కలను మార్కెట్ పరిధిలోని సీసీ రోడ్లపై రైతులు ఆరబోసుకున్నారు. మరుసటి రోజు అమ్ముకునేందుకుగాను ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. కాగా సాయంత్రం వర్షం రావడంతో యార్డు అధికారులు వెంటనే స్పందించి మక్కలు ఆరబోసిన రైతులకు తాటిపత్రిలను అందజేశారు. అయినా కొంత వరకు మక్కలు తడిసినట్లు పలువురు రైతులు తెలిపారు.

84
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...