రైతు సంక్షేమానికి పెద్దపీట


Fri,October 11, 2019 04:06 AM

ఆత్మకూరు, అక్టోబర్ 10 : తెలంగాణలో రైతుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద పీట వేశారని వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ అన్నారు. గురువారం గూడెప్పాడ్‌లోని మార్కెట్ ఆవరణలో ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్ నూతన పాలకవర్గ ప్రమాణాస్వీకారోత్సవం నిర్వహించారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అధ్యక్షత జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీ పసునూరి దయాకర్ పాల్గొన్నారు. ముందుగా మార్కెట్ కమిటీ చైర్మన్ కాంతాల కేశవరెడ్డి, వైస్ చైర్మన్ దాడి మల్లయ్యతో పాటు, సభ్యులు ప్రమాణా స్వీకారం చేశారు. అనంతరం ఎంపీ పసునూరి దయాకర్ మాట్లాడుతూ కృష్ణా, గోదావరి నదుల మధ్య తెలంగాణ రాష్ట్రం ఉంటుందన్నారు. అధికంగా నీరు అందుబాటులో ఉన్నప్పటికీ వాడుకోకుండా సీమాంధ్ర పాలకులు కుట్రలు చేశారని ఆరోపించారు. కానీ, సీఎం కేసీఆర్ ముందుస్తుగా మిషన్ కాకతీయతో చెరువుల పూడిక తీయించారన్నారు. దీంతో గ్రామాల్లో చెరువులు నిండుకుండల్లా ఉన్నాయన్నారు. రైతులకు మూడు పంటలకు సరిపోయే నీరు ఉందన్నారు. అంతేకాకుండా రైతుల కోసం నాణ్యమైన 24 గంటల కరంటు ఇచ్చి ఆదుకున్న ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. అతి పెద్ద కాళేశ్వర్ ప్రాజెక్టును మూడున్నరేళ్లలో నిర్మించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనన్నారు. అనంతరం పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ఏనాడు తెలంగాణ ప్రాంత అభివృద్ధి గురించి, రైతుల గురించి పట్టించుకోలేదన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటిని నేత, ముఖ్యమంత్రి కేసీఆర్ దశల వారీగా అమలు చేస్తున్నారన్నారు. రైతులకు సేవ చేస్తే దేశానికి సేవ చేసినట్లేనన్న సంకల్పంతో రైతులకు వివిధ రకాల పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారన్నారు. రైతు బీమా, రైతు బంధు, 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ను అందించి రైతులను ఆదుకుంటున్నారన్నారు. రైతులకు యూరియా, డీఏపీ అందుబాటులో ఉండాలని బంపర్ స్టాక్ అందుబాటులో ఉంచారని చెప్పారు. రైతులు కార్యాలయాల చుట్టూ తిరగకుండా రెవెన్యూ అధికారులే గ్రామాలకు వెళ్లేలా భూసమస్యల పరిష్కార వేదిక గ్రామ సభలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సాదాబైనామాలో దరఖాస్తు చేసుకున్న రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. మండలానికి 5వేల మెట్రిక్ టన్నుల గోదాముల ను ముందుస్తుగా కట్టించినట్లు తెలిపారు.

మార్కెట్ కంటే గూడెప్పాడ్ మార్కెట్‌లోనే పది రూపాయలు ఎక్కువ ధర కల్పించి, రైతులకు లాభం చేకూరేలా చైర్మన్‌తో పాటు, పాలక వర్గం కృషి చేయాలని సూచించారు. రైతులు పండించిన ప్రతీ ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. గూడెప్పాడ్ మార్కెట్‌కు దామెర, ఆత్మకూరు, హసన్‌పర్తి మండలాలే కాకుండా ఇతర మండలాల నుంచి రైతులు ధాన్యాన్ని తీసుకొచ్చేలా ప్రజాప్రతినిధులు సహకరించాలన్నారు. రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించి, వారికి అందుబాటులో ఉండాలన్నారు. గూడెప్పాడ్ కేంద్రంగా హోల్‌సేల్ కూరగాయాల మార్కెట్ కోసం తన వంతు కృషి చేస్తానన్నారు. అనంతరం ఎంపీ, ఎమ్మెల్యేలను నూతన పాలకవర్గం గజమాలతో సత్కరించింది. కార్యక్రమంలో ఆత్మకూరు, దామెర ఎంపీపీలు మార్క సుమలత, కాగితాల శంకర్, జెడ్పీటీసీలు కక్కెర్ల రాధిక, కల్పన, మొగిలి, వైస్ ఎంపీపీలు రేవూరి సుధాకర్‌రెడ్డి, జాకీర్‌అలీ, పార్టీ మండల అధ్యక్షులు లేతాకుల సంజీవరెడ్డి, నేరేళ్ల కమలాకర్, కార్యదర్శులు బొల్లెబోయిన రవియాదవ్, పున్నం సంపత్, జిల్లా నాయకులు నిమ్మగడ్డ వెంకన్న, బండి సారంగపాణి, బొల్లోజు కుమారస్వామి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, రైతు మండల కోఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు.

మార్కెట్ కార్యవర్గం ఇదే..
ఆత్మకూరు మార్కెట్ చైర్మన్‌గా కాంతాల కేశవరెడ్డి, వైస్ చైర్మన్‌గా దాడి మల్లయ్య, సభ్యులుగా నిమ్మల స్వరూప, అర్షం భిక్షపతి, చకిలం రాజేశ్వర్‌రావు, అరే వెంకటరెడ్డి, గోల్కండ శ్రీనివాస్, నూనేవతి రాజు, కౌటం మోహన్, రేవూరి మల్లారెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన చైర్మన్ కాంతాల కేశవరెడ్డిని ఆత్మకూరు, దామెర, హసన్‌పర్తి, పరకాల, నడికూడ మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్ నాయకులు శాలువాలు, బొకేలతో ఘనంగా సన్మానించారు.

మార్కెట్ డైరెక్టర్లకు అభినందనల వెల్లువ
దామెర : గుడెప్పాడ్ వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్‌గా దాడి మల్లయ్యతోపాటు డైరెక్టర్లుగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన దామెర మండలంలోని పసరగొండకు చెందిన కౌటం మోహన్, ఊరుగొండకు చెందిన ఆరె వెంకట్ రెడ్డి, వెంకటాపురం-సింగరాజుపల్లికి చెందిన గోల్కొండ శ్రీను తదితరులను ఎంపీపీ కాగితాల శంకర్, వైస్ ఎంపీపీ జాకీర్ అలీ, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కమలాకర్, ఎంపీటీసీలు రామకృష్ణ, గోవిందు సంధ్య, మౌనికతోపాటు పలు గ్రామాలకు చెందిన సర్పంచ్‌లు శాలువాలు, పుష్పగుచ్ఛాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పున్నం సంపత్, బొల్లు రాజు, జగన్, సిలివేరు నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

84
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...