బస్సులు ఫుల్!


Fri,October 11, 2019 04:05 AM

వరంగల్ రూరల్ జిల్లా ప్రతినిధి - నమస్తే తెలంగాణ : ఆర్టీసీ బస్ డిపోల నుంచి రోడ్డెక్కే బసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. గురువారం జిల్లాలోని నర్సంపేట, పరకాల డిపోల నుంచి 88 సర్వీసులు నడిచాయి. 130 మంది తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు డ్యూటీ చేశారు. బసులు ఫుల్‌గా తిరగడంతో ప్రజలు హ్యాపీగా ప్రయాణం చేశారు. ఆర్టీసీ కార్మికులు ఈ నెల ఐదు నుంచి సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్ర త్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్ల నియామకంతో అధికారులు రోజు ఆర్టీసీ, అద్దె బస్సులు నడుపుతున్నారు. రవాణాలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వివిధ రూట్లలో అవసరమైనన్ని బస్సులు తిరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రధాన రూట్లలోనే కాకుం డా అన్ని రూట్లలోనూ బస్సులు నడిచేలా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో నర్సంపేట, పరకాల ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. ఈ రెం డు డిపోల నుంచి రోజు అధికారులు ఆర్టీ సీ, అద్దె బస్సులు నడుపుతున్నారు. బుధవారం ఈ రెండు డిపోల నుంచి 85 సర్వీసులు నడిచాయి. గురువారం వీటి సంఖ్య 88కు పెరిగింది. నర్సంపేట డిపో నుంచి 44 బస్ సర్వీసులు నడిచాయి. వీటిలో 25 ఆర్టీసీ, 19 అద్దె బస్సులు ఉన్నాయి. ఇక్కడ 69 మంది తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు పనిచేశారు. వీరిలో డ్రైవర్లు 25, కండక్టర్లు 44 మంది ఉన్నారు. అలాగే, పరకాల డిపో నుంచి కూడా 44 సర్వీసులు నడిచాయి. వీటిలోనూ 25 ఆర్టీసీ, 19 అద్దె బస్సులు ఉన్నాయి. ఈ డిపో పరిధిలో తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు 61 మంది విధులు నిర్వహించారు. వీరిలో డ్రైవర్లు 17, కండక్టర్లు 44 మంది ఉన్నా రు. నర్సంపేట నుంచి వరంగల్, హన్మకొండ, హైదరాబాద్, మహబూబాబాద్ తదితర రూట్లలో బస్సులు నడిచాయి. పరకాల నుంచి హన్మకొండ, హైదరాబా ద్, భూపాలపల్లి, హుజురాబాద్ తదితర రూట్లలో తిరిగాయి. సరిపడా బస్సులు నడవడంతో ప్రజలు సంతోషంగా తమ ప్రయాణం సాగించారు. డిపోల వద్ద పోలీసులు నిరంతరం బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఆర్టీసీ, పోలీసు, రెవెన్యూ అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

నర్సంపేట డిపో పరిధిలో..
నర్సంపేట, నమస్తేతెలంగాణ : ఆరోరో జూ ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగింది. సమ్మె ఇంకా కొనసాగించాలని కార్మికులు నిర్ణయించడంతో ఆర్టీసీ ఉన్నతాధికారు లు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తగు నిర్ణయాలను తీసుకున్నారు. తాత్కాలిక సిబ్బంది సంఖ్యను పెంచడానికి నిర్ణయించారు. ప్రైవేట్ సర్వీసులను కూడా నడిపించాలని ఆదేశించారు. షెడ్యూల్ ప్రకారం, వివిధ గ్రామాలు, పట్టణాలకు బస్సులు నడిపించేలా డీఎంలు చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతో నర్సంపేటలో ఇప్పటివరకు 45 సర్వీసులను నడిపించిన అధికారులు వీటి సంఖ్యను పెంచడానికి నిర్ణయం తీసుకున్నారు. పండుగ రద్దీ కారణంగా ప్రజలను గమ్యస్థానాలకు చేర్చడంలో ప్రత్యేక శ్రద్ధను చూపాలని ఆదేశాలు జారీ చేశారు. డిపోలో అందుబాటులో ఉన్న ఆర్టీసీ బస్సులు 25, హైర్ బస్సులను 19ని రోడ్డెక్కించడానికి 45 మంది డ్రైవర్లు, 45 మంది కండక్టర్లను తాత్కలికంగా పనుల్లోకి తీసుకున్నారు. అయితే ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం పలువురు నాయకులు సమావేశం నిర్వహించారు. పట్టణంలోనూ కార్మికులు ర్యాలీ నిర్వహించారు. టీచర్స్ యూనియన్ కూడా సంఘీభావం ప్రకటించింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐ కరుణసాగర్‌రెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...