ధాన్యం కొనుగోళ్లకు సిద్ధంకండి


Fri,October 11, 2019 04:04 AM

పరకాల, నమస్తే తెలంగాణ : వానాకాలంలో పండించిన ధాన్యం కొనుగోళ్ల కోసం అధికారులు ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలని సివిల్ సప్లయీస్ కమిషనర్ అకున్ సబర్వాల్ సూచించారు. గురువారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లతో అకున్ సబర్వాల్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కొనుగోళ్ల కోసం పీపీసీలను ఏర్పాట్లు చేయాలన్నారు. వ్యవసాయ శాఖ సహకారంతో నాణ్యతా ప్రమాణాలను పాటించి, ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశించారు. ఏఈవోలు, గ్రామస్థాయి అధికారులు గ్రామాల వారీగా ధాన్యం సేకరించాలని సూచించారు. మార్కెటింగ్ శాఖ అధికారులు, సివిల్ సప్లయ్ డీఎంలు గన్నీ సంచుల కొరత లేకుండా చూడడంతోపాటు మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రొక్యూర్‌మెంట్ ఏజెన్సీ అధికారులతో అగ్రిమెంట్ చేయాలన్నారు. రైస్ మిల్లర్లందరితో ఒప్పందం కుదుర్చుకుని, అండర్‌టేకింగ్ తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లపై సందేహాలు, సలహాలు స్వీకరించేందుకు టోల్‌ఫ్రీ నంబర్ 79950 50785 ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ నెంబర్ ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తుందని వివరించారు. వ్యవసాయ శాఖ అధికారులు సవరించిన ధాన్యం దిగుబడి వివరాలను సోమవారం వరకు అందించాలని సూచించారు. వీడియోకాన్ఫరెన్స్‌లో జిల్లా సివిల్ సప్లయ్ అధికారి గౌరీశంకర్, సివిల్ సప్లయ్ జిల్లా మేనేజర్ ఇ భాస్కర్‌తో పాటు ఏఎస్‌వోలు, సివిల్ సప్లయ్ డీటీలు పాల్గొన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...