ఓపెన్ స్కూల్ విద్యపై అవగాహన కల్పించాలి


Fri,October 11, 2019 04:04 AM

సుబేదారి, అక్టోబర్ 10 : ఓపెన్ స్కూల్ విద్యా విధానంపై మరింత అవగాహన కల్పించాలని ఓపెన్‌స్కూల్ స్టేట్ పరిశీలకుడు తిరుమలారెడ్డి అన్నారు. గురువారం హన్మకొండ డైట్ కళాశాలలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ల సమావేశం ఇన్‌చార్జి మురాల శంకర్‌రావు అధ్యతన నిర్వహించారు. సమావేశంలో తిరుమలరెడ్డి మాట్లాడుతూ చదువు మధ్యలో మానేసిన వారికి కోసం రాష్ట్ర విద్యాశాఖ ఓపెన్ స్కూల్ విద్య విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి గ్రామస్థాయిలో అవగాహన కల్పించాలని ఆయన కోఆర్డినేటర్లకు సూచించారు. ఓపెన్ స్కూల్‌లో అడ్మిషన్లను పెంచాలని, చదువు మానేసిన వారికి తిరిగి విద్యను అందించడానికి చొరవ చూపాలన్నారు. చదివేవారికి సకాలంలో స్టడీ మెటియల్ అందించి, నాణ్యమైన విద్యబోధనతో ఉత్తీర్ణత శాతం పెంచాలని కోరారు. వరంగల్ అర్బన్ డీఈవో నారాయణరెడ్డి, కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...