18న మద్యం షాపులకు డ్రా


Thu,October 10, 2019 04:44 AM

-వరంగల్ ఉమ్మడి జిల్లాలో 261 షాపులు
-నూతన స్లాబులకు అనుగుణంగా డ్రా
-అర్బన్ జిల్లాలో 59 షాపులకు తొలిరోజు వచ్చిన దరఖాస్తులు ఏడు
-ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సురేశ్ రాథోడ్

వరంగల్‌క్రైం, అక్టోబర్ 9: ఉ మ్మడి జిల్లా వ్యాప్తంగా (ములు గు, జనగామ, భూపాలపల్లి, వ రంగల్ అర్బన్, వరంగల్ రూ ర ల్, మహబూబాబాద్) 261 మ ద్యం షాపులకు ఈనెల 18న జి ల్లా కలెక్టర్ల సమక్షంలో డ్రాలు తీ యనున్నట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సురేశ్ రాథోడ్ పేర్కొన్నారు. బుధవారం డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీ సురేశ్ రాథోడ్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన మద్యం నూతన పాలసీలో ఆరు స్లాబులకుగాను నాలుగు స్లా బులు మాత్రమే ఉమ్మడి జిల్లా వ్యా ప్తంగా పరిగణలోకి వస్తున్నాయన్నారు. రూ.50 లక్షల లైసెన్స్ ఫీజులో 44 షాపులు, రూ.55 లక్షల లైసెన్స్ ఫీజులో 126 షాపు లు, రూ.60 లక్షల లైసెన్స్ ఫీజులో 34 షాపులు, రూ.85 లక్షల లైసెన్స్ ఫీజులో 5 7 షాపులు ఉన్నట్లు పేర్కొన్నారు. బుధవారం నుంచి వైన్ షా పుల టెండర్లకు దరఖాస్తులు ఆహ్వానించినందున ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 40 షాపులకు 60 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. పరకాలలో రెండు, భూపాలపల్లిలో రెండు షా పుల నిర్వహణ సరిగ్గా లేనందున మెదక్, ఖమ్మం రీజియన్‌కు తరలించినట్లు తెలిపారు. లైసెన్స్‌దారుడు రెండు సంవత్సరాల లైసెన్స్ ఫీజులో 1/8వ వంతు మొదటగా చెల్లించాలన్నారు. ఆరు జిల్లాల హెడ్‌క్వార్టర్స్‌లో 18న ఉదయం 10:30 గంటలకు డ్రాలు తీయబడునని, 16వ తేదీ సాయంత్రం 4గంటల వరకే దరఖాస్తులు స్వీకరించబడునని పేర్కొన్నారు. దరఖాస్తుల వెంట రూ.2లక్షల డీడీతోపాటు ఆధార్‌కార్డు, పాన్ కార్డు, నాలుగు క లర్ ఫొటోలు జతపరిచి జిల్లా హెడ్ క్వార్టర్స్‌లోని సూపరింటెండెంట్ కార్యాలయం లేదా డిప్యూటీ కమిషనర్ కార్యాలయం లేదా హైదరాబాద్‌లో సమర్పించవచ్చునని పేర్కొన్నారు.

అర్బన్ జిల్లాలో ఏడు దరఖాస్తులు
వరంగల్ అర్బన్ జిల్లాలోని 59 వైన్ షాపుల్లో బుధవారం ఏడు షాపులకు ఏడు దరఖాస్తులు వచ్చినట్లు సూపరింటెండెం ట్ పెరుమాళ్ల బాలస్వామి పేర్కొన్నారు. ఏడు షాపుల్లో గెజిట్ నంబర్ 27, 34, 36, 38, 39 (హన్మకొండ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వంగపహాడ్, భీమారం, హసన్‌పర్తి, హన్మకొండ చౌరస్తా, ఎల్కతుర్త్తి), ఖిలావరంగల్, కాజీపేట షాపులకు దరఖాస్తులు వ చ్చినట్లు ఆయన పేర్కొన్నారు.

97
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...