నేత్రపర్వంగా దేవీశరన్నవరాత్రోత్సవాలు


Thu,October 10, 2019 04:41 AM

రెడ్డికాలనీ, అక్టోబర్ 09: చారిత్రక రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు విజయదశమి ఉత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. రుద్రేశ్వరిదేవికి, ఉద్వాసన పూజ, కలశ, కంకణ ఉద్వాసన, దీక్షా సమాప్తం చేసి సూక్తివిధానంతో పూజల అనంతరం రుద్రేశ్వరిదేవికి మంగళవాయిద్యాల మధ్య ఆలయం నుంచి ఊరేగింపుగా తరలించారు. మహిళలు మంగళహారతులతో ప్రాచీన కోనేరు తటాకంలో అమ్మవారికి దుర్గాసూక్తంతో వేదోక్తంగా ఆలయ ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ, ఇతర అర్చకులు శ్రీచక్రస్నానం ఆచరించడం జరిగింది. నీరాజన మంత్రపుష్పాల అనంతరం సాయంత్రం షమి, ఆయుధపూజ చేసి ప్రత్యేక రథంపై అమ్మవారిని ప్రతిష్ఠించి మంగళహారతులు సమర్పించి జిల్లా పౌరసంబంధాల శాఖ, జిల్లా సాంస్కృతిక మండలి ఏర్పర్చిన, సాంస్కృతిక బృందాల, కో లాట బృందం తో వారి ఆటాపాటలతో అమ్మవారి శోభాయాత్ర పురవీధుల గుండా రుద్రేశ్వరిమాతాకీ జై అంటూ.. భక్తులు అమ్మవారి నామస్మరణ చేస్తూ భక్తులు తరలివచ్చారు. అనంతరం పద్మాక్షి అమ్మవారి గుండంలో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో ఉత్సవ సమిటీ సభ్యులు ఆలయ ఈవో వేణుగోపాల్, భక్తులు పాల్గొన్నారు. సాయంత్రం ఆలయంలో భక్తులందరికీ షమి పత్రాన్ని అందజేశారు. ఆలయ ఈవో వేణుగోపాల్, ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ మాట్లాడుతూ బతుకమ్మ పండుగకు, దేవీనవరాత్రి ఉత్సవాలకు సహకరించిన దాతలకు, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌కు, మున్సిపల్, పోలీసు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...