తిరుగు ప్రయాణం..!


Thu,October 10, 2019 04:41 AM

ప్రయాణికులతో కిక్కిరిసిన రైల్వేస్టేషన్
ఖిలావరంగల్, అక్టోబర్ 09: దసరా సెలవుల్లో భాగంగా స్వగ్రామాలకు వచ్చిన ప్రజలు తిరిగి వారి గమ్యస్థానాలకు చేరుకునేందుకు బయలు దేరారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంతోపాటు దసరా సెలవులు పూర్తయిన తర్వాత తిరిగి వెళ్లేటప్పుడు రైళ్లు కిక్కిరిసి పోతాయని ఊహించిన ప్రజలు ముందస్తు ప్రయాణాలు చేసున్నారు. సుఖవంతమైన ప్రయాణం కోసం సీటు రిజర్వేషన్లు చేసుకొని ప్రయాణికులు రైళ్ల కంటే ముందే రైల్వే స్టేషన్‌కు చేరుకుంటున్నారు. దీంతో వరంగల్ రైల్వేస్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసి పోయింది. వరంగల్ నుంచి విజయవాడ, వరంగల్ నుంచి హైదరాబాద్,బల్లార్ష వైపు వెళ్లే రైళ్లు ప్రయాణికుల రద్దీతో వెళ్లా యి. ముఖ్యంగా హైదరాబాద్ వైపు వెళ్లే ప్రతి రైలు బోగిలో అడు గు పెట్టే సందులేకుండా ప్రయాణికులతో నిండిపోయాయి. ఇదే పరిస్థితి ఈ వారాంతం ఉంటుందని రైల్వే వర్గాలు తెలిపాయి.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...