మధ్య తరగతి గృహిణికి బిల్ షాక్


Thu,October 10, 2019 04:41 AM

ఐనవోలు, అక్టోబర్ 09 : మధ్యతరగతి కు టుంబానికి కరెంట్ బిల్లు నెలకు ఎంత రావ చ్చు. మహా అంటే రూ.500.. లేకపోతే రూ.1000 రావచ్చు. కానీ ఓ ఇంటికి ఏకంగా రూ.19,409 బిల్లు వచ్చింది. మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన నందనబోయిన రుక్కమ్మ ఇంటికి గతంలో మాదిరిగానే విద్యుత్ సిబ్బంది వచ్చి బిల్లు ఇచ్చి వెళ్లాడు. దీంతో బిల్లును చూసిన గృహిణి ఒక్కసారిగా షాక్ గురైంది. తన ఇంట్లో కేవలం ఒక ఫ్యాన్, రెండు లైట్లు ఒక ఫ్రిడ్జ్, టీవీ మాత్రమే ఉన్నాయి. వీటి వినియోగానికి ఒక నెలకు రూ.19,409 బిల్లు రావడంతో ఆమె కంగారు పడింది. ఈ సమస్యను విద్యుత్ అధికారులు స్పందించి పరిష్కారం చూపాలని ఆమె కోరింది.

కమలాపూర్‌లో రేపు సదరం క్యాంపు
కమలాపూర్: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సదరం క్యాంపు నిర్వహిస్తున్నట్లు ఎంపీపీ తడక రాణి బుధవారం తెలిపారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆదేశాల మేరకు ఈనెల 11న కమలాపూర్ 30 పడకల ఆసుపత్రిలో సదరం క్యాంపు చేపడుతున్నట్లు చెప్పారు. మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన వికలాంగులు ఈ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అర్హులైన వికలాంగులు ఆధార్ కార్డు, పొటో తీసుకుని రావాలని సూచించారు.

77
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...