అమాత్యుడి ఆత్మీయ పర్యటన


Tue,October 8, 2019 04:30 AM

సిద్ధార్థనగర్, అక్టోబర్07: కాలనీ భద్రత కోసం కాలనీ వాసులే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమని ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. హన్మకొండ బాలసముద్రంలోని కోదండరామ నిలయంలో 16 సీసీ కెమెరాలను సోమవారం సీపీ కమిషనర్‌తో పాటు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం చీఫ్‌విప్ దాస్యం మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హన్మకొండ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగిన ఘటనలో సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించడాన్ని ప్రత్యక్షంగా చూశానన్నారు. అప్పటి నుంచి సీసీ కెమెరాలపై నమ్మకం మరింత పెరిగిందని, ప్రతి కాలనీలో ప్రజల భాగస్వామ్యంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేలా ప్రోత్సహిస్తున్నానని పేర్కొన్నారు. సీపీ రవీందర్ మాట్లాడుతూ.. నేరాలను నియంత్రించడంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు వచ్చిన కాలనీవాసులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో కుడా చైర్మన్ మర్రియాదవరెడ్డి, కార్పొరేటర్ వేముల శ్రీనివాస్, కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

77
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...