మహిశాసురమర్ధిని అలంకరణలో భవానీమాత


Tue,October 8, 2019 04:28 AM

అర్బన్ కలెక్టరేట్, అక్టోబర్ 07: హన్మకొండ పద్మాక్షికాలనీలోని సిద్ధేశ్వరాలయంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజు సోమవారం భవానీమాతను ఖడ్గదారిగా అలంకరించి ప్రత్యేక పూజలు చేసినట్లు అర్చకులు సిద్ధ్దేశుని రవికుమార్, సురేశ్‌కుమార్ తెలిపారు. మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచి అమ్మవారికి మంగళహారతి ఇచ్చారు. అనంతరం మహాన్నదానం చేశారు.

రెడ్డికాలనీలో మహాన్నదానం
రెడ్డికాలనీ : హన్మకొండ రెడ్డికాలనీలోని ఫ్రెం డ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత వద్ద సోమవారం మహాన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్ర త్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కుసుమ లక్ష్మీనారాయణ, సభ్యులు శ్రీకాంత్, బబ్లూ, అన్వర్, సుమన్, సా యి, నజీర్, నాగరాజు, రాకేశ్, ఈశ్వర్, చిం టు, కోటి, శివ, శివసాయితేజ, సాకేత్ పాల్గొన్నారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...