దుర్గాదేవిని దర్శించుకున్న జెడ్పీ చైర్మన్


Tue,October 8, 2019 04:27 AM

-ప్రత్యేక పూజలు చేసిన సుధీర్‌కుమార్
భీమదేవరపల్లి: ములుకనూరులో వివేకానంద యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి మండపంలో సోమవారం జెడ్పీచైర్మన్ మారెపల్లి సుధీర్‌కుమార్ ప్రత్యేక పూజలు చేశారు. గ్రామంలో దుర్గాదేవి నవరాత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు చేసిన అనంతరం వివేకానంద యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన లక్కీడ్రా లాటరీని తీసి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ మాడుగుల కొంరయ్య, ఎంపీటీసీలు బొల్లంపల్లి రమేశ్, అప్పని పద్మ, ఉపసర్పంచ్ సుద్దాల రఘు, వివేకానంద యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు బైరి సదానందం, సభ్యులు రాజయ్య, విట్టోభ, రమేశ్, శ్రీకాంత్, యుగంధర్, విజయ్, రమేశ్, రాము, జగన్ పాల్గొన్నారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...