రావణవధలో జాగ్రత్తలు పాటించాలి..


Tue,October 8, 2019 04:27 AM

-కాజీపేట సీఐ అజయ్
కాజీపేట, అక్టోబర్ 07: కాజీపేట పట్టణంలో దసరా పర్వదినం సందర్భంగా జరిగే రావణవధ కార్యక్రమంలో నిర్వాహకులు తగు జాగ్రత్తలు పాటించాలని స్థానిక సీఐ అజయ్ సూచించారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మాట్లాడుతూ పట్టణంలోని వివిధ కాలనీల్లో ఏర్పాటు చేసిన రావణవధ కార్యక్రమాన్ని తిలకించేందుకు వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

రౌడీ షీటర్లకు హెచ్చరిక..
పట్టణంలో ప్రజలు ప్రశాంతంగా దసరా వేడుకలను జరుపుకోవాలని, రౌడీషీటర్ల పాత కక్షలను దృష్టిలో పెట్టుకుని అల్లర్లకు పాల్పడితే పీడీ యాక్టు నమోదు చేస్తామని కాజీపేట సీఐ అజయ్ హెచ్చరిచారు. కాజీపేట పీఎస్‌లో సోమవారం ఆయన రౌడీషీటర్లకు సమావేశం నిర్వహించారు. పీఎస్ పరిధిలో ఎలాంటి హింసాత్మక ఘటనలు జరిగినా మీరే బాధ్యులవుతాని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్సై దేవేందర్, సిబ్బంది పాల్గొన్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...