తల్లిదండ్రులను పూజిస్తే ఐష్టెశ్వర్యాలు


Tue,October 8, 2019 04:27 AM

కాజీపేట, అక్టోబర్ 07: తల్లిదండ్రులను పూజించడం వల్ల అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని శ్రీ మధుసూదన సరస్వతి స్వామిజీ అన్నారు. కాజీపేట శ్రీ శ్వేతార్క మూల గణపతి దేవాలయంలో జరుగుతున్న శ్రీ దేవీ నవరాత్రి ఉత్సవాల్లో సోమవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు అర్చకులు అయినవోలు రాధాకృష్ణ శర్మ, సాయి కృష్ణ శర్మ, త్రిగుళ్ల శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామిజీ అమ్మవారికి, శ్వేతార్కుడికి ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులను, గురువులను గౌరవించడమనే సంప్రదాయాన్ని మరిచిపోవద్దని అన్నారు. తల్లిదండ్రులను పూజించే ముఖ్యమైన ఉద్దేశం దేవీ నవరాత్రుల్లో ఇమిడి ఉందని అన్నారు. నేడు వృద్ధులైన తల్లిదండ్రులను వృద్ధ్దాశ్రమాల్లో చేర్పించడం విచారకరమని అన్నారు. అనంతరం వివిధ ప్రాంతాల నుంచి దేవాలయంకు విచ్చేసిన భక్తులకు ఆలయ నిర్వాహకులు అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం నిర్వాహకులు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో దేవాలయ వ్యవస్థాపక చైర్మన్ వెంకటేశ్వర శర్మ-పుష్పలత, నాగరాజశర్మ, చిదంబర శాస్త్రి, వెంకటేశ్వర్లు, ఆరవెల్లి బాబురావు, భారతి, గుణవతి, శ్రీనివాస్, అభిలాశ్, రవి, మణి తదితరులు పాల్గొన్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...