18న మద్యం షాపుల డ్రా


Mon,October 7, 2019 03:53 AM

వరంగల్ క్రైం, అక్టోబర్ 06 : ఈ నెల 18న మద్యం షాపుల డ్రా తీయనున్నుట్లు వరంగల్ అర్బన్ జిల్లాఎక్సైజ్ సూపరింటెండెంట్ పెరుమాండ్ల బాలస్వామి తెలిపారు. ఆదివారం హన్మకొండలోని సూపరింటెండెంట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎక్సైజ్ సీఐలతో కలిసి మద్యం కొత్త పాలసీపై మాట్లాడారు. రెండేళ్లకు గానూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పాలసీ తీసుకొచ్చిన క్రమంలో నవంబర్ 1 నుంచి కొత్త షాపుల నిర్వహణ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. జనాభా ప్రాతిపాదికన 4 స్లాబ్‌లు, 6 స్లాబ్‌లుగా చేయడం జరిగిందని వాటిల్లో మూడు స్లాబ్‌లు మాత్రమే అర్బన్ జిల్లాలో వర్తించడం జరుగుతుందని పేర్కొన్నారు. రూ.50 లక్షలు, రూ.55 లక్షలు, రూ. 85 లక్షల లైసెన్స్ ఫీజు గల 3 స్లాబ్‌లు మాత్రమే అర్బన్ పరిధిలోకి వస్తాయన్నారు. రూ.50 లక్షల లైసెన్స్ స్లాబ్‌లో నారాయణగిరి, కొత్తకొండ, రూ.55 లక్షల స్లాబ్‌లో కమలాపూర్‌లో 5, భీమదేవరపల్లిలో 2, వేలేరు-1 షాపు, రూ.85 లక్షల లైసెన్స్ పరిధిలోకి 49 షాపులు వస్తాయన్నారు. డ్రాలో షాపును గెలుచుకున్న వ్యాపారులు లైసెన్స్ ఫీజుల్లో మొదటగా 1/8 వంతు ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు.

సంవత్సరానికి నాలుగు దఫాల్లో లైసెన్స్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. గతంలో 3 దఫాలు మాత్రమే ఉందని కొత్తపాలసీలో మరో టర్మ్‌ను పెంచినట్లు వివరించారు. లైసెన్స్ ఫీజుతో పాటు ఎక్సైజ్ సుంకంను రూ.5 లక్షలు చెల్లించాలని పేర్కొన్నారు. కలెక్టర్ ఆదేశాలతో ఈ నెల 18న ఉదయం 11 గంటలకు అంబేద్కర్ భవన్‌లో డ్రా తీసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, 9 నుంచి 16వ తేదీ వరకు సాయంత్ర 4 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించబడునన్నారు. దరఖాస్తుదారులు ఫీజు రూ.2 లక్షలను ఏదైనా జాతీయ బ్యాంకులో ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ పేరిట డీడీ, చలాన్ తీసి ఆధార్, పాన్‌కార్డు జిరాక్స్‌లను జతపరిచి హౌజింగ్ బోర్డులోని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో దరఖాస్తుదారుడే స్వయంగా అందించాలని తెలిపారు. దరఖాస్తు చేసుకోవడం గతంలో కన్న ఈసారి చాలా సులువుగా చేశారన్నారు. అప్పట్లో 1413 మంది దరఖాస్తుగా చేసుకోగా ఈ సారి పోటీ పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుందన్నారు. సమావేశంలో ఏఈఎస్ శ్రీనివాస్, హన్మకొండ, ఖిలావరంగల్, కాజీపేట, వరంగల్ అర్బన్ ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్ల సీఐలు రామకృష్ణ, చంద్రమోహన్, ప్రవీణ్, అంజన్‌రావు పాల్గొన్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...