పోచమ్మ ఆలయంలో స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి


Mon,October 7, 2019 03:52 AM

పోచమ్మమైదాన్, అక్టోబర్ 06: వరంగల్ పోచమ్మమైదానంలోని శ్రీకనకదుర్గ, పోచమ్మ ఆలయా న్ని విశాఖ శ్రీశారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేద్ర సరస్వతీ స్వామి ఆదివారం సందర్శించారు. మాజీ మంత్రి బస్వరాజు సారయ్య ఆధ్వర్యంలో ఆయన ఆలయానికి విచ్చేసి, పరిశీలించారు. గర్భగుడిలోని కనకదుర్గమ్మ, పోచమ్మ విగ్రహాలను పరిశీలించారు. అలాగే నాగేంద్రస్వామితో పాటు ఆలయ పరిసరాలను తిరిగి చూశారు. ప్ర స్తుతం ఆలయంలో జరుగుతున్న నిర్మాణ పనుల్లో భాగంగా కొన్ని మార్పులు, చేర్పులు చేసేందుకు తగిన సలహాలు, సూచనలు ఇచ్చారు. కనకదుర్గ మ్మ ఆలయం, మండపం, గోపురం తదితర ని ర్మాణ పనుల గురించి చర్చించారు.

రూ. కోటితో ఆలయ అభివృద్ధి : మాజీ మంత్రి బస్వరాజు సారయ్య
గ్రామ దేవతలైన పోచమ్మ, కనకదుర్గమ్మ ఆలయాలను సుమారు రూ.కోటి వ్య యంతో పునరుద్ధ్దరణ పనులు చేపడుతున్నామని మాజీ మంత్రి బస్వరాజు సారయ్య తెలిపారు. ఇప్పటికే రూ.22 లక్షలతో పునరుద్ధ్దరణ పనులు జరిగాయని, సీఎం స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ నుండి మంజూరైన రూ.42 లక్షలతో ఇతర పనులు, మరో రూ.22 లక్షలతో ప్రహరీ నిర్మాణం చేపట్టనున్నట్లు వివరించారు. ముఖ్యంగా తెలంగాణలోనే ఓరుగల్లు కీర్తి చాటే విధంగా గర్భగుడితోపాటు మరో 30 ఫీట్ల వరకు గోపురాన్ని అందంగా తీర్చిదిద్దుతామని ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ యెలుగం లీలావతి, నాయకులు బస్వరాజు కుమారస్వామి, యెలుగం సత్యనారాయణ, కావటి రాజు, తోట ఆనందర్‌రావు, మాజీ కార్పొరేటర్ బస్వరాజు కుమా ర్, ఆకారపు రమణయ్య, ఆనంద్, రాములు, డీఎస్ మూర్తి, సమ్మయ్య, గోరంటల రాజు, సిద్దోజు విద్యాసాగర్, బాబు, సాంబయ్య, సాంబమూర్తి పాల్గొన్నారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...