ఘనంగా దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు


Mon,October 7, 2019 03:52 AM

రెడ్డికాలనీ, అక్టోబర్ 06: చారిత్రాత్మక వేయిస్తంభాల దేవాలయంలో దేవీ శర న్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా 8వ రోజు ఆదివారం ఉదయం 5 గంటలకు సుప్రభాతసేవ నిర్వహించి, రుద్రేశ్వరునికి రు ద్రా భిషేకం చేపట్టారు. దేవీ మంటపంలో రుద్రేశ్వరిదేవిని దుర్గాదేవిగా త్రిశూలదారినిగా అలంకరించారు. దుర్గాష్ఠమి రోజున అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆలయ ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు. మధ్యాహ్నం యాగశాలలో మహాచండీ యాగం నిర్వహించా రు. అమ్మవారిని సింహవాహనంపై ప్రతిష్ఠించి దే వాలయ ప్రాంగణంలో ఊరేగించారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమం లో ఉత్సవ సమితి సభ్యులు కోన శ్రీఖర్, పల్లం రమేశ్, మాడిశెట్టి రాజ్‌కుమార్, పులి రజినీకాంత్, మాడిశెట్టి సాంబయ్య, శ్రీదేవి దంపతులు ఉభయ దాతలుగా వ్యవహరించారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...