నేడు సద్దుల బతుకమ్మ


Sun,October 6, 2019 02:52 AM

-తీరొక్క పూలతో సంబురం
-హన్మకొండ పద్మాక్షిగుట్టకు తరలిరానున్న ఆడబిడ్డలు
-మహానగర పాలక సంస్థ అధికారుల ప్రత్యేక ఏర్పాట్లు

వరంగల్ చౌరస్తా, అక్టోబర్ 05: నగరానికి సద్దుల బతుకమ్మ శోభ సంతరించుకుంది. శనివారం సాయంత్రం వరంగల్‌లోని సంతలో మహిళల సందడి కనిపించింది. ఆదివారం సద్దుల బతుకమ్మ పండుగ కావడంతో వరంగల్ చౌరస్తా నుంచి రైల్వేస్టేషన్ వరకు బతుకమ్మను పేర్చడానికి అవసరమయ్యే తంగేడు, గునుగు, బంతి, ఇతర పువ్వులను పెట్టి విక్రయించారు. ఆడబిడ్డలు భారీగా తరలివచ్చిన పూలు కొనుగోలు చేశారు. పండుగ నేడా..! అనే అంతగా.. ఎటు చూసినా జనసందోహమే కనిపించింది. పండుగ సంత కారణంగా రోడ్లన్నీ జనమయం కావడంతో ట్రాఫిక్ పోలీసులు వాహనాల దారి మళ్లించారు. ఇంతేజార్‌గంజ్ పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.

88
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...