సద్దుల బతుకమ్మకు సర్వం సిద్ధం


Sun,October 6, 2019 02:50 AM

ఐనవోలు, అక్టోబర్ 05 : మండలంలోని అన్ని గ్రామాల్లో సద్దుల బతుకమ్మ వేడుకలకు స్థానిక ప్రజాప్రనిధులు సర్వం సిద్ధం చేశారు. ఆయా గ్రామాల్లోని చెరువు కట్టపై హైమాస్ట్ లైట్లు, చెరువు కట్ట నుంచి గ్రామాల్లోని కూడలిల వరకు రోడ్డుకు ఇరువైపులా విద్యుత్ లైట్లు అమర్చారు. చెరువుల్లో బతుకమ్మ నిమజ్జనం కోసం చెరువు కట్టలకు తాత్కాలిక, శాశ్వత మెట్లను ఏర్పాటు చేయించారు. ఒంటిమామిడిపల్లిలో ఎల్లమ్మ చెరువు కట్టకు నూతనంగా ఏర్పాటు చేసిన మెట్లను సర్పంచ్ ఆడెపు దయాకర్, పంచాయతీ కార్యదర్శి బొల్ల సుకన్యతో కలిసి శనివారం పరిశీలించారు. ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఉప సర్పంచ్, కార్యదర్శులు తదితరులు ఏర్పాట్లను పరిశీలించారు.

మడికొండలో...
మడికొండ : మడికొండతో పాటు చుట్టు ప్రక్కల గ్రామాల్లో సద్దుల బతుకమ్మకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మహిళలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. మడికొండ మెట్టుగుట్ట వద్ద 33వ డివిజన్ కార్పొరేటర్ తొట్ల రాజుయాదవ్ బతుకమ్మ ఆట స్థలాన్ని డోజర్లతో చదును చేయిచారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డివిజన్‌లోని ఆరు బతుకమ్మ పాయింట్ల వద్ద పరిసరాలను శుభ్రం చేసినట్లు చెప్పారు. కాసానిటరీ ఇన్‌స్పెక్టర్ కరుణాకర్, భిక్షపతి, కొమురయ్య, వినయ్, చంటి, నవీన్, బల్దియా సిబ్బంది పాల్గొన్నారు.

కమలాపూర్‌లో...
కమలాపూర్: మండలంలోని కమలాపూర్, ఉప్పల్, శనిగరం, మర్రిపెల్లిగూడెం, గూడూరు, కన్నూరు, భీంపల్లి, శంభునిపల్లి, కానిపర్తి, శ్రీరాంలపల్లి, గోపాల్‌పూర్ తదితర గ్రామాల్లో శనివారం బతుకమ్మ ఏర్పాట్లు చేశారు. కమలాపూర్‌లో పెద్ద చెరువు కట్టపై సుమారు అర కిలోమీటరు దూరం విద్యుత్ స్తంభాలు వేయించి ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు చేశారు. చెరువు కట్టపై పనులను విజయారెడ్డి, కార్యదర్శి ఆంజనేయులు, నాయకులు కట్కూరి తిరుపతిరెడ్డి, కుమారస్వామి, రాజేశ్, నరేందర్‌రెడ్డి పరిశీలించారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...