యువత సేవా కార్యక్రమాల్లో ముందుండాలి


Sun,October 6, 2019 02:50 AM

మడికొండ, అక్టోబర్ 05: యువత సేవా కార్యక్రమాల్లో ముందుండాలని కేయూ స్పోర్ట్స్ బోర్డు డైరెక్టర్, మాజీ ఎన్‌సీసీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ ప్రొఫెసర్ బి.సురేశ్‌లాల్ సూచించారు. 33వ డివిజన్ తరాలపల్లిలో ప్రభుత్వ వృత్తి జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో వారం రోజుల పాటు నిర్వహించిన ఎన్‌ఎస్‌ఎస్ ప్రత్యేక శిబిరం శనివారం ముగిసింది. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో కళాశాల ప్రిన్సిపాల్ పి.దివాకర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సమాజ గమన వికాసానికి ఎన్‌ఎస్‌ఎస్ శిబిరాలు దోహదపడుతాయన్నారు. యువత వివేకానంద స్ఫూర్తితో దేశ భవిష్యత్ నిర్మాణానికి పాటు పడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మధుసూదన్‌రెడ్డి, హెచ్‌ఎం అరుణ, శ్రీనివాస్ గౌడ్, రవి, అధ్యాపకులు ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...