ఐవీఎఫ్‌పై అవగాహన అవసరం


Sun,October 6, 2019 02:49 AM

ప్రముఖ గైనకాలజిస్టు డాక్టర్ ప్రవీణ
రెడ్డికాలనీ, సెప్టెంబర్ 28 : టెస్ట్‌ట్యూబ్ బేబీ/ఐవీఎఫ్‌పై అవగాహన అవసరమ కాకాజీకాలనీ లోని బేబీస్ లైఫ్ హాస్పిటల్, టెస్ట్‌బ్యూబ్ బేబీ సెంటర్ గైనకాలజిస్టు డాక్టర్ ప్రవీణ అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఏడాది కాలం సాధారణ అనురక్షిత లైంగిక సంపర్కం తర్వాత గర్భం ధరించిన దంపతుల సంతానలేమి సమస్యకు డాక్టర్ల సలహా ప్రకారం చికిత్స తీసుకోవడం సరైన పద్ధతి అని తెలిపారు.

సంతాన లేమికి కారణాలు
-స్త్రీలలో అధిక వయస్సు ఫెల్లోఫియన్ నాళాలచే సమస్యలు, గర్భసంచి లోపాలు, లైంగిక వ్యా ధులు, సంతానోత్పత్తి అవయవాలకు టీబీ సో కడం, హార్మోన్ల అసమతుల్యత, గుడ్లతిత్తుల్లో నీటి బుడగలు, అండోత్పత్తి కాకపోవ డం, ఎండోమెట్రియోసిస్ వంటివి సంతాన లేమికి కారణాలన్నారు.

-మగవారిలో వీర్యకణాలు లోపించడం, వీర్యకణాల కదలికలో, నాణ్యత లోపాలు, లైంగిక సంపర్క లోపాలు
ఐవీఎఫ్ : ఐవీఎఫ్ మహిళలు గర్భవతి కావటానికి సహాయపడే సహాయక పునరుత్పత్తి సాంకేతిక పరిజ్ఞానం. ఇది ఇతర చికిత్సలు పనిచేయనప్పుడు గర్భం ధరించడంలో సహాయ పడుతుంది. ఇది శరీరం లోపల ప్రయోగశాలలో గుడ్లను ఫలదీకరణం చేసి స్త్రీ గర్భాశయంలో ప్రవేశపెట్టే పద్ధతి. పునరుత్పత్తి సాంకేతిక పరిజ్ఞానం పురోగతి కారణంగా ఐవీఎఫ్ సక్సెస్ రేట్లు కొన్ని సంవత్సరాల క్రితం ఉన్నదాని కంటే ఈరోజు గణనీయంగా పెరిగాయి. ఐవీఎఫ్ విజయశాతం మైక్రోఇంజక్షన్(ఐసీఎస్‌ఐ) విధానం వల్ల పెరిగాయి. ఇక్సి మొదటిసారిగా 1992లో ప్రవేశపెట్టారు. ఇక్సీ విధానంలో వీర్యకణం నేరుగా గుడ్డు కణంలోకి ప్రవేశపెడతారు. వీర్యకణాల సంఖ్య చాలా తక్కువ ఉన్నవారికి వీర్యకణ కదలికలో లోపాలు, వీర్యకణ నాణ్యత లోపాలు ఉన్నవారికి మైక్రో ఇంజక్షన్(ఇక్సి) విదానం ఉత్తమమైంది.

సంతానంలేని జంటలు శారీరకంగా, మానసికంగా ఒత్తిడికి గురవుతారు. దంపతులు ఇరువురి ఒత్తిడికి దూరంగా ఉండాలి. దంపతుల జీవనశైలి విధానంలో మార్పులు, శారీరక వ్యాయామం, పోషకాహారం, మంచి నిద్ర అవసరం. దూమపానం, పొగాకు, మద్యపానంకు దూరంగా ఉండాలి. చరవాణి వినియోగాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించాలి. చాలా జంటలు సంతానలేమి సమస్యకు భార్య లేదా భర్త మాత్రమే కారణం అనుకుని విలువైన సమయాన్ని వృథా చేస్తారు. సంతానలేమి సమస్యకు దంపతులు ఇద్దరూ అవగాహన ప్రకారం చికిత్స తీసుకోవడం ఉత్తమమైన పద్ధతి అని తెలిపారు. భారతదేశంలో ఐవీఎఫ్ చికిత్సలు పాశ్చాత్య దేశాల ఖర్చుకంటే దాదాపు ఐదు రెట్లు తక్కువ.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...