ముగిసిన జాతీయ వన్యప్రాణి వారోత్సవాలు


Sun,October 6, 2019 02:49 AM

అర్బన్ కలెక్టరేట్, అక్టోబర్ 05: హన్మకొండ హంటర్‌రోడ్డులోని కాకతీయ జూపార్క్‌లో నిర్వహిస్తున్న జాతీయ వన్యప్రాణి వారోత్సవాలు శనివారం ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ సర్కిల్ ముఖ్య అటవీ సంరక్షణ అధికారి ఎంజే అక్బర్ హాజరై మాట్లాడారు. అటవీ సంరక్షణ మనందరి బాధ్యత అని అన్నారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మాధవిరెడ్డి, ఓరుగల్లు వైల్డ్‌లైఫ్ సొసైటీ బాధ్యులు శ్యాంసుందర్, నాగేశ్వర్‌రావు, ఎన్‌జీవో డాక్టర్ జగన్, వెటర్నరీ సర్జన్ డాక్టర్ ప్రవీణ్‌కుమార్, రెస్క్యూ టీం సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...